Site icon Prime9

Viral Video: అరుదైన దృశ్యం… కళ్లు మూస్తూ తెరుస్తూ ఉన్న హనుమంతుని విగ్రహం..!

hanuman idol blinking eyes

hanuman idol blinking eyes

Viral Video: వినాయకుడి విగ్రహం పాలు తాగడం… చెట్టు నుంచి పాలు కారడం… వంటి వాటిని మనం వినే ఉంటాం. కాగా వీటిని కొందరు హిందువులు దైవం చేస్తున్న అద్భుతంగా భావిస్తారు. అయితే ప్రస్తుతం ఇలాంటి ఘటనే మరొకటి తాజాగా మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఉన్న ఓఖ్లేశ్వర్ ధామ్‌లో అద్భుతం జరిగింది. ఓఖ్లేశ్వర్ ధామ్‌లోని హనుమంతుడి మందిరంలో మూలవిరాట్ విగ్రహం కళ్లు ఆర్పడం చూసి అక్కడి భక్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. అది కాస్త ఆనోటాఈనోట వ్యాపించి ఓఖ్లేశ్వర్ ధామ్‌కు భక్తలు పోటెత్తారు. స్థానిక ప్రజలు దీన్ని బజరంగబలి మహిమ అని చెప్తుండగా, మరి కొందరు హనుమాన్ వీడియోను ఎడిట్ చేసినట్లుగా పేర్కొంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సెప్టెంబర్‌ 17న శనివారం సాయంత్రం ఖర్గోన్‌లోని ప్రపంచ ప్రసిద్ధగాంచిన ఓఖ్లేశ్వర్ ధామ్‌లో ప్రతిష్టించిన హనుమంతుడి యొక్క పురాతన విగ్రహం కనురెప్పలు ఆర్పుతూ తెరుస్తూ ఉంది. అప్పుడే దానిని చూసిన ఒక భక్తుడు ఈ అద్భుత దృశ్యాన్ని కెమెరాలో బంధించాడు. అయితే మరికొందరు భక్తులు ఆలయానికి వెళ్లి చూస్తే అలాంటిదేమీ జరగలేదని తెలిపారు.

అయితే రోహిణి నక్షత్రంలో చోళుల అలంకరణ సమయంలో హనుమాన్ విగ్రహం కళ్లు ఆర్పడం జరిగిందని ప్రజలు అంటున్నారు. అయితే ఇక్కడ ఇలాంటి అద్భుతాలు జరగడం కొత్తేమీ కాదని పూజారి, భక్తులు అంటున్నారు. కాగా వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: Viral News: ఇదేం పాడుపని… ఛీఛీ.. కూరగాయలపై మూత్రం పోసి విక్రయిస్తున్న వ్యాపారి

Exit mobile version