Site icon Prime9

Sarvadarshanam Tokens: నేటి అర్ధరాత్రి నుండి సర్వదర్శనం టోకెన్లు జారీ

Sarvadarshanam tokens will be issued from midnight today

Tirumala: అర్ధరాత్రి నుంచి అలిపిరిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లోనూ టోకెన్లు పంపిణీ చేస్తామన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లు, వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇకపై శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మంగళ, బుధ,గురు, శుక్రవారాల్లో 15వేల టోకెన్లు జారీ చేస్తామన్నారు. సర్వదర్శన టోకెన్లు అయిపోగానే కౌంటర్లు మూసివేస్తామని, టోకెన్‌ లేనివారు కూడా కొండపైన సర్వదర్శనానికి వెళ్లొచ్చన్నారు. భక్తుల సౌకర్యార్ధం తితిదే కొత్తగా సర్వదర్శనానికి టోకన్లు జారీ చేస్తోంది.

ఇది కూడా చదవండి: Tirupati: నవంబర్‌ 1 నుంచి తిరుపతిలో టైమ్‌స్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు

Exit mobile version