Site icon Prime9

TTD: తితిదే కు ఎన్నారై భూరి విరాళం

NRI donates a huge amount to TTD

NRI donates a huge amount to TTD

NRI Donation: కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఓ ఎన్నారై భక్తుడు భూరి విరాళాన్ని అందచేశారు. అమెరికాలో స్ధిరపడిన డేగా వినోద్ కుమార్, రాధిక రెడ్డిలు కోటి రూపాయల బ్యాంకు డీడీని తితిదే కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డికి అందచేశారు.

విరాళాన్ని టీటీడీ నిర్వహిస్తున్న స్విమ్స్ వైద్యశాల సేవలకు వినియోగించాలని దాతులు కోరారు. అలాగే బెంగళూరు కేఆర్ పురంకు చెరందిన మునిరాజ అనే భక్తుడు కూడా రూ. 30లక్షలు విలువచేసే 600గ్రాముల బంగారు చెవి దిద్దులు టీటీడీ అధికారులకు కుటుంబసభ్యుల సమక్షంలో అందచేశారు.

తిరుమలలో చేపడుతున్న అన్న ప్రసాదాల వితరణ, గో సేవలతోపాటు పలు సేవలకు భక్తులు భారీగా విరాళాలను అందిస్తున్నారు. మరో వైపు పెరటాశి మాసం 4వ శనివారంను పురస్కరించుకొని తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. సర్వ దర్శనానికి 30గంటల పైగా సమయం పడుతుండడంతో క్యూలైన్లలోని భక్తులకు అల్పహారాన్ని, పాలను శ్రీవారి సేవలకు అందిస్తున్నారు. భక్తుల రద్ధీ నేపథ్యంలో టిటిడి ప్రత్యమ్మాయ ఏర్పాట్లు చేసి స్వామి వారి దర్శనాన్ని భక్తులకు కల్పిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Venkateswara Swamy Vaibhavotsavalu: శ్రీవారి నేత్ర దర్శనంతో పులకించిన భాగ్యనగరవాసులు

Exit mobile version