Site icon Prime9

Tirumala Brahmotsavalu: తిరుమలలో హంస వాహనంలో ఊరేగిన మలయప్ప స్వామి

Malayappa swami in Tirumala procession in a Swan vehicle

Malayappa swami in Tirumala procession in a Swan vehicle

Tirumala: కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. శోభయామానంగా జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఉదయం చిన్న శేష వాహనంపై ఊరేగుతూ స్వామి వారు భక్తులకు కనువిందు చేసారు. మధ్యాహ్నం మలయప్పకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం దేధ్వీపమానంగా వెలుగుతున్న విద్యుత్ కాంతుల నడుమ మాఢవీధుల్లో స్వామి వారిని హంస వాహనంలో ఊరేగించారు.

రెండు సంవత్సరాల అనంతరం ఆలయం వెలుపుల భక్తుల నడుమ బ్రహ్మోత్సవాలు చేపట్టడంతో తిరుపతి, తిరుమల ప్రాంతాలు భక్తుల రద్ధీతో కిక్కిరిసిపోయి. ఏడుకొండల వాడి నామస్మరణలతో ఆలయం పులకరించిపోయింది. భక్తులకు అన్నప్రసాదాలు, స్వామి వారి దర్శన భాగ్యం, క్యూలైన్ల పర్యవేక్షణలను ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు పర్యవేక్షిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అడ్డుకొన్న న్యాయవాదులు

Exit mobile version