Site icon Prime9

Tirumala Tirupathi Devasthanam: 21 నుండి భక్తులకు అందుబాటులో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు

From 21st of this month you can get tickets for Srivari Arjita services

From 21st of this month you can get tickets for Srivari Arjita services

Tirumala: తిరుమల తిరుపతి దేవస్ధానం భక్తులకు శుభవార్త. డిసెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలను ఈ నెల 21 నుండి టిటిడి ఆన్ లైన్ విధానంలో నమోదు చేసుకోవచ్చని తితిదే ప్రకటించింది.

నవంబర్ మాసానికి సంబంధించిన అంగ ప్రదక్షిణ టిక్కెట్ల విక్రయాలు 21న ఉదయం 10గంటల నుండి బుకింగ్ చేసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా డిసెంబర్ మాసానికి సంబంధించిన ఆర్జిత సేవలను 21వ తేదీ మధ్యాహ్నం 3గంటల నుండి బుకింగ్ చేసుకోవచ్చని భక్తులకు సూచించింది. దీంతో పాటుగా డిసెంబర్ నెలలో శ్రీవారి సేవలో పాల్గొనే భక్తులు తమ పేర్లను 22వ తేది ఉదయం 10గంటల నుండి 24వ తేది ఉదయం 10గంటల వరకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిష్ట్రేషన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొనింది.

ఇది కూడా చదవండి: Tirumala: తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు…ఏయే రోజులంటే ?

Exit mobile version