Site icon Prime9

Vijayawada Kanaka Durgamma: విజయవాడ కనకదుర్గమ్మకు మూడు బంగారు కిరీటాలు

Devotee-Gifts-Vijayawada-Kanaka-Durgamma

Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువైన కనకదుర్గమ్మకు ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించాడు. నవీ ముంబైకి చెందిన రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యజమాని జి.హరికృష్ణారెడ్డి వీటిని అమ్మవారికి సమర్పించారు.

అమ్మవారి ఉత్సవ విగ్రహ అలంకరణ కోసం తయారు చేయించిన ఈ కిరీటాలు ఒక్కోటి 1308 గ్రాముల బరువున్నాయి. ఆలయ ఈవో భ్రమరాంబకు ఆయన వీటిని అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం హరికృష్ణారెడ్డి కుటుంబానికి ప్రధానార్చకులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ ఈవో ప్రసాదం, అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం అందజేశారు.

Exit mobile version