Site icon Prime9

Murder Case : పల్నాడు జిల్లాలో దారుణం.. గొడ్డళ్లు, వేటకొడవళ్లతో నరికి యువకుడి హత్య

Muder Case of married women at eluru district

Muder Case of married women at eluru district

Murder Case : ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. మండలంలోని జంగమేశ్వర గ్రామంలో కూనిరెడ్డి కృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు పులిపాడు గ్రామంలో ప్రభుత్వ వైన్ షాపు సూపర్వైజర్ గా పని చేస్తున్నాడు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కృష్ణారెడ్డిని చంపిన హంతకులను పట్టుకోవడం కోసం మూడు స్పెషల్ టీంలను పోలీసులు రంగంలోకి దింపినట్టు సమాచారం. కృష్ణారెడ్డి మృతదేహాన్ని గురజాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు.

కృష్ణారెడ్డిపై సుమారు ఐదుగురు ప్రత్యర్థులు ముసుగులు వేసుకుని, కళ్ళల్లో కారం చల్లి హత్య చేసినట్టుగా స్థానికులు తెలిపారు.ఈ హత్య రాజకీయ కోణమా ఇంకా ఇతరమైన కారణాల అనే అంశంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గురజాల మండలంలో ఫ్యాక్షన్ గ్రామమైన జంగమహేశ్వరం గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. కూనిరెడ్డి కృష్ణారెడ్డి జంగమహేశ్వపురం వైఎస్ఆర్సిపీలో యాక్టివ్ గా పని చేస్తారు. ఆయన హత్యకు గురవడం జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది.

 

 

Exit mobile version