Site icon Prime9

Hyderabad Kidnap : హైదరాబాద్ లో యువతి కిడ్నాప్ ఘటనలో మరో అప్డేట్..!

young-girl-mother-emotional-words-about-kidnap-in-hyderabad

young-girl-mother-emotional-words-about-kidnap-in-hyderabad

Hyderabad Kidnap : హైదరాబాద్ లో తాజాగా జరిగిన యువతి కిడ్నాప్ కేసులో మరిన్ని వివరాలు బయటికి వస్తున్నాయి. కాగా కొద్దిసేపటి క్రితమే యువతి కిడ్నాప్ కి గురైన విషయం తెలిసిందే. తుర్కయంజాల్ మున్సిపల్ పరిధి మన్నేగూడ లోని సిరి టౌన్ షిప్ లో నివసిస్తున్న యువతిని ఆమె ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో యువతి నివసిస్తున్న ఇల్లు పూర్తిగా ధ్వంసం చేసి ఆడొచ్చిన ఆమె కుటుంబ సభ్యులు, బంధువులపై కూడా దాడి చేశారు.

కాగా ఈ కిడ్నాప్ ఉదంతంలో మెయిన్ గా మిస్టర్ టి నిర్వాహకుడు ” నవీన్ రెడ్డి ” అని తెలుస్తుంది. కిడ్నాప్ కి గురైన యువతి ముచర్ల వైశాలి . కాగా 24 ఏళ్ల వయసున్న ఈమె ప్రస్తుతం డెంటల్ డాక్టర్ గా చేస్తుంది. ఆమె తల్లిదండ్రులు ముచ్చర్ల దామోదర్ రెడ్డి, నిర్మల. అయితే సుమారు 100 మంది దాడి చేసిన ఈ ఘటనలో దామోదర్ రెడ్డి కూడా గాయాలపాలయ్యారు. ఈ దారుణ ఘటనతో గతం లోనే నవీన్ రెడ్డి పై ఆదిభట్ల పోలీస్ స్టేషన్ లో అమ్మాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని బాధితులు వాపోతున్నారు. తమ కూతుర్ని క్షేమంగా ఇంటికి తీసుకురావాలని కోరుతున్నారు.

ఈ సంధర్భంగా వైశాలి తల్లి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆ వీడియో లో ఆమె మాట్లాడుతూ… సుమారు 50, 60 మందితో వచ్చిన నవీన్ రెడ్డి బలవంతంగా అమ్మాయిని ఎత్తుకు పోయాదని వాపోయారు. ఈరోజు తమ కూతురుకి పెళ్లి చూపులు చూస్తున్నాం అని అందుకే వారి బంధువులు కూడా ఇంటికి వచ్చారని ఇలాంటి తరుణంలో కావాలనే నవీన్ ఇలా చేశాడని కన్నీరు పెట్టుకున్నారు. పెళ్లి చూపులను ఆపాలి కానీ అమ్మాయిని ఎత్తుకుపోవడం ఏంటని బాధపడుతున్నారు. మా కూతుర్ని ఎలా అయిన క్షేమంగా ఇంటికి తీసుకు రావాలని కోరుతున్నారు.

మరోవైపు ఇందుకు ప్రతిచర్యగా అమ్మాయి తరుపు బంధువులు నవీన్ రెడ్డి టీ షాప్ ని తగలబెట్టడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఆ షాప్ లో సామాగ్రిని అంతటినీ పగలగొట్టి షాప్ ని తగాలబెట్టిన దృశ్యాలు సామాజిక మధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో అని…

Exit mobile version