Site icon Prime9

Ghaziabad Gang Rape: మహిళపై గ్యాంగ్ రేప్.. జననాంగాల్లో రాడ్ చొప్పించి మరీ..!

10th class girl gangraped in hyderabad

10th class girl gangraped in hyderabad

Ghaziabad Gang Rape: రోజుకు ఏదో ఓ మూలన మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా వారిపై దాడులు ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె జననాంగాల్లో రాడ్ చొప్పించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఢిల్లీ శివారులోని యూపీ రాష్ట్రం ఘజియాబాద్‌లో ఇలాంటి ఒక దారుణ ఘటన తెర మీదకు వచ్చింది. ఢిల్లీకి చెందిన ఒక మహిళ రాత్రి ఘజియాబాద్ నుండి తిరిగి వస్తుండగా ఆమెను ఓ ఐదుగురు వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుని సుమారు 2 రోజుల పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాక ఆమె ప్రైవేట్ పార్ట్స్‌లో రాడ్‌ని కూడా అమర్చారని తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 18, తెల్లవారుజామున ఆశ్రమ రోడ్డులో ఒక మహిళ అచేతనంగా పడి ఉన్నట్లు పోలీసు స్టేషన్ నంద్‌గ్రామ్‌కు యూపీ-112 ద్వారా సమాచారం అందిందని వారు తెలిపారు.

ఆమెను ఆసుపత్రికి తరలించిన తర్వాత విచారణలో బాధిత మహిళ ఢిల్లీ నంద్ నగరి నివాసి అని తేలింది. ఆమె తన సోదరుడి పుట్టినరోజు నేపథ్యంలో ఘజియాబాద్‌కు వచ్చిందని, ఆ సమయంలో ఆమెకు తెలిసిన కొంతమంది కారులో తీసుకెళ్లారని.. మొదట ఇద్దరే కారులో ఉన్నా తర్వాత మరో ఐదుగురు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత మహిళ పేర్కొనింది. బాధిత మహిళ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. బాధితురాలుకు సంబంధించి కొద్దిరోజులుగా ఆస్తి తగాదా నడుస్తుందని దీనివల్ల ఏర్పడిన వివాదం వలనే ఆమెను అపహరించి రేప్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చదవండి: ఉలిక్కిపడిన గుంటూరు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణ హత్య..!

 

Exit mobile version