Wife killed Husband: హైదరాబాద్ మధురానగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భర్తను కాదని ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య చివరికి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు కిరాయి రౌడీలను కూడా ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
గుండెపోటుగా నమ్మించి..(Wife killed Husband)
ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉండే విజయ్ కుమార్, శ్రీ లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. అయితే బోరబండకు చెందిన రాజేశ్ తో శ్రీలక్ష్మి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది గమనించిన భర్త పలుమార్లు మందలించడంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగాయి. ఈ క్రమంలో భర్తకు చెందిన ఆస్తులను అమ్మేసి ప్రియుడితో వెళ్లిపోవాలని డిసైడ్ అయిన శ్రీలక్ష్మి.ఫిబ్రవరి 1న ప్రియుడు, మరో ఇద్దరు రౌడీ షీటర్లతో కలిసి భర్త విజయ్ ను గొంతు నులిపి దారుణంగా హత్య చేయించింది. ఆ తర్వాత గుండెపోటుగా చనిపోయినట్లు బంధువులను నమ్మించింది. ఇదిలా ఉండగా..విజయ్ ని హత్య చేసిన వారిలో రాజేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి తాజాగా మధురానగర్ పీఎస్ కు వచ్చి చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నలుగురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వారిని వెతికే పనిలో ఉన్నారు.