New Delhi: వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో నిందితుడుగా ఉన్న శివ శంకర రెడ్డికి సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. బెయిల్ ఇవ్వడానికి తగిన కారణాలు సరైనవిగా తమకు కనిపించడం లేదని న్యాయస్ధానం పేర్కొనింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఈ దశలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. శివశంకర రెడ్డి న్యాయవాది సుప్రీం లో తన వాదనలు బలంగా వినిపించారు.
వివేకా హత్య కేసులో, తొలి ఎఫ్ఐఆర్ లో శివశంకర రెడ్డి పేరు లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అప్రూవర్ గా మారిన వాచ్మెన్ వాగ్మలంలో కూడా ఆయన పేరులేదని వాదించారు. ఏ1 నిందితుడు మూడు నెలల్లో బెయిల్ పొందిన విషయాన్ని ఆయన తరపు న్యాయవాది ధర్మాసనంకు గుర్తు చేసారు. 11 నెలలు అవుతున్నా, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా శివ శంకర రెడ్డికి బెయిల్ ఇవ్వడం లేదని న్యాయవాది విన్నవించుకొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వివేకా హత్య కేసులో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్ ను తిరస్కరించింది.
బెయిల్ పై వచ్చిన వారు సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉదాశీనతగా వ్యవహరిస్తుందని, పోలీసులు సైతం సీబిఐ అధికారుల పై కేసులు పెడుతున్నారని కేసును ఏపి హైకోర్టు నుండి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని వివేకానంద రెడ్డి కూతురు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసివున్నారు. దీనిపై వచ్చేనెల ధర్మాసనం విచారణ చేపట్టనున్న నేపథ్యంలో శివశంకర రెడ్డికి సుప్రీంలో చుక్కెదురైంది.
ఇది కూడా చదవండి: రాజాసింగ్ ప్రాణాలకు ముప్పు.. విజయశాంతి