Site icon Prime9

Anathapuram: ప్రేమ పేరుతో బెదిరించి తాళికట్టి.. ఆపై అత్యాచారం

19-year-old-model-gang-raped-in-moving-car-in-kochi

19-year-old-model-gang-raped-in-moving-car-in-kochi

Anathapuram: ఇంటర్మీడియట్ చదువుతున్న తన సహచర విద్యార్థినిపై ఓ యువకుడు ప్రేమ పెళ్లి పేరుతో బెదిరించి మరీ తనపై అఘాత్యాయికి పాల్పడ్డాడు. పాఠశాలలో చదువుకున్నప్పుడు తనను ప్రేమించి, రెండేళ్ల అనంతరం తనను ప్రేమించమంటూ లేదంటే తన కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ ఆమెను భయపెట్టి తాళి కట్టి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం అనంతపురం నగరంలో వెలుగు చూసింది.

అనంతరపురం నగరానికి చెందిన హేమంత్‌ అనే యువకుడు తన క్లాస్‌మేట్‌ అయిన ఓ అమ్మాయితో పాఠశాల చదువుతున్న రోజు నుంచి సన్నిహితంగా ఉండేవాడు. ఆమెను ప్రేమ పేరుతో వేధించేవాడు. అమ్మాయి తనను ప్రేమించక పోతే ఆమె తల్లి, చెల్లిని చంపుతానని బెదిరించేవాడు. దానితో భయపడిన ఆ యువతి అతనితో మాట్లాడేది. ఇదే అదునుగా భావించిన ఆ యువకుడు ఈ ఏడాది జూన్‌లో ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నపుడు తన ఇంట్లోకి వెళ్లి బలవంతంగా తనకు తాళికట్టాడు. ‘ఇక నుంచి నువ్వు నా భార్యవంటూ..’ బ్లాక్‌మెయిల్‌ చేసి, తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భయభ్రాంతులకు గురైన విద్యార్థిని ఇంట్లో తెలిస్తే ఏమంటారో అని ఎవరికి చెప్పుకోలేక ఇంట్లో ఉన్నపుడు తాళి దాచిపెట్టుకుని ఉండేది. కర్నూలులో ఇంటర్మీడియట్‌ సెకండియర్‌ చదువుతున్న ఆమె ఇటీవల దసరా సెలవులు వచ్చింది. అప్పుడు కూడా ఆమెను వదలకుండా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సెలవుల అనంతరం కళాశాలకు వెళ్లిన విద్యార్థిని వెంటపడి, అక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇక వీటిని భరించలేకపోయిన బాధితురాలు ఇటీవల తల్లికి అసలు విషయం చెప్పింది. దీంతో ఆమె అనంతపురం దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరబిందో ఫార్మా డైరెక్టర్‌ అరెస్ట్

Exit mobile version