Viral News: ఓ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ ల్యాప్‌టాప్ చోరీ చేశాడు. అంతవరకు బాగానే ఉన్నా ఏమనుకున్నాడో ఏమోకానీ ఆ దొంగ ఇంటికెళ్లి “మరోదారి లేక దొంగతనం చేశానంటూ క్షమాపణ మెయిల్ పెట్టాడు”. లాప్‌టాప్‌లోని ముఖ్యమైన ఫైల్స్‌ను సదరు ల్యాప్ టాప్ యజమానికి పంపించాడు. ఈ మెయిల్ చూసిన ల్యాప్‌టాప్ యజమాని సంతోషించాలో, బాధపడాలో తెలియట్లేదంటూ నెట్టింట వాపోయాడు.
“నిన్న రాత్రి నా ట్యాప్ టాప్‌ను ఎవరో దొంగిలించారు. ఈ రోజు ఉదయం నా మెయిల్ ఐడీ నుంచే నాకు ఓ మెయిల్ వచ్చింది. దాన్ని తెరిచి చూస్తే “నిన్న మీ ల్యాప్ టాప్‌ను ఎత్తుకెళ్లింది నేనే. చాలా కష్టాల్లో ఉన్న నాకు మరో దారి కనిపించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ పని చేయాల్సి వచ్చింది. ఇక ఈ ల్యాప్‌టాప్‌లో మీరు దాచుకున్న రీసెర్చ్ ఫైల్స్‌ను ఈ మెయిల్‌తో పంపిస్తున్నా. లాప్ టాప్‌లో ఇంకా ఏమైనా ముఖ్యమైన ఫైల్స్ ఉంటే చెప్పండి. మీకు పంపించేస్తా. అయితే సోమవారంలోపే అడగండి. ఆ తర్వాత ఈ ల్యాప్ టాప్ నా దగ్గర ఉండదు అని ఉందని ఆ దొంగ చెప్పాడు. దానిని ల్యాప్‌టాప్ యజమాని స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ల్యాప్‌టాప్ పోయినందుకు బాధపడాలో లేక కష్టపడి చేసిన పరిధోనకు సంబంధించిన ఫైల్స్ దక్కించుకునందుకు సంతోషించాలో తెలియట్లేదని జ్వైల్లీ థిక్సో అనే ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దానికి కొందరు నెటిజన్లు దొంగతనం చేస్తే చేశాడు కానీ విలువైన ఫైల్స్ పంపించాడు. ఎంతైనా మంచి దొంగేనని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం వివరాలు తెలియరాలేదు.
ఇదీ చదవండి: ఘోర రోడ్డు ప్రమాదాలు.. 7 మంది దుర్మరణం