Site icon Prime9

కాన్పూర్: 10 అడుగుల సొరంగం తవ్వి మరీ.. బ్యాంకులో కోటిరూపాయలు మాయం చేసిన ముఠా

Kanpur

Kanpur

Kanpur: కాన్పూర్ లోని ఎస్బీఐ బ్రాంచ్ లో భారీ చోరీ జరిగింది. రూ.కోటి విలువ చేసే బంగారాన్ని దొంగల ముఠా దోచుకెళ్లింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భానుతి బ్రాంచ్ పక్కనే ఉన్న ఖాళీ స్థలం నుంచి నాలుగు అడుగుల వెడల్పుతో 10 అడుగుల సొరంగం తవ్వి మరీ ఈ దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సొరంగం ద్వారా దొంగలు నేరుగా స్ట్రాంగ్ రూమ్ లోకి ప్రవేశించారు.

దుండగులు లాకర్‌ను తెరిచేందుకు గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించారు. అలారం సిస్టమ్‌ను కూడా ధ్వంసం చేసి స్ట్రాంగ్‌రూమ్‌లోని ఏకైక సీసీటీవీ కెమెరాను పక్కకు తిప్పారు.అందులోని 1.8 కేజీల బంగారాన్ని దోచుకున్నారు. అయితే పక్కనే రూ.32 లక్షలు ఉన్న క్యాష్ చెస్ట్ ను తెరవలేకపోయారు. అనంతరం తమ పని పూర్తి చేసుకొని దొంగలు సొరంగం ద్వారా బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ ధుల్ అక్కడికి చేరుకున్నారు. చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

చోరీకి గురైన బంగారం అంచనాను తెలుసుకునేందుకు బ్యాంకు అధికారులకుసమయం పట్టింది. దీని బరువు 1.8 కిలోలకు పైగా ఉందని విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని డీసీపీ విజయ్ ధూల్ తెలిపారు. ఈ దోపిడిపై పోలీసులు, ఫోరెన్సిక్ అధికారులు దర్యాప్తు చేపట్టారని, బ్యాంక్ స్ట్రాంగ్‌రూమ్‌కు ఆనుకొని ఉన్న ఖాళీ స్థలం నుంచి సొరంగం తవ్వినట్టు వారు గుర్తించారని తెలిపారు.

Exit mobile version