Site icon Prime9

Visakhapatnam : విశాఖలో డ్రమ్ములో మహిళ డెడ్ బాడీ కేసు వెనుక స్టోరీ ఇది..

Visakhapatnam

Visakhapatnam

Visakhapatnam: విశాఖ మధురవాడలో రెండు రోజుల కిందట కలకలం రేపిన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ప్లాస్టిక్ డ్రమ్ లో కుళ్లిపోయిన స్థిలో మహిళ మృతదేహం కనిపించడం కలకలం రేపిన విషయంతెలిసిందే. రిషి అనే వ్యక్తి ఈ మహిళను హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. మృతురాలిని శ్రీకాకుళం జిల్లా కు చెందిన బమ్మిడి ధనలక్ష్మి గా పోలీసులు గుర్తించారు. నిందితుడ్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీసు కస్టడీ కి తీసుకుని విచారిస్తున్నారు.

ఏడాదిన్నర కిందట శ్రీకాకుళం బస్ స్టాప్ లో రిషికి, ధనలక్ష్మి కి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో మధురవాడలో అద్దెకు ఉన్న ఇంటికి ఓసారి ఆమెను తీసుకువచ్చి శారీరకంగా కలిశాడు రిషి. ఆ పరిస్థితిని ఆసరాగా తీసుకుని రిషిని డబ్బులు డిమాండ్ చేసేది ధనలక్ష్మి. కొంతకాలానికి విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలుస్తుందని ఆందోళన చెందిన రిషి చున్నీని మెడను బిగించి ధనలక్ష్మిని హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అయితే శవాన్ని ఇంట్లో దాచిపెట్టిన రిషి ఆ తరువాత మృతదేహాన్ని నీటి డ్రంలోకి మార్చాడు. ఇంటి యజమానికి భార్య డెలివరీ కి వెళ్ళింది వచ్చిన తర్వాత అద్దె చెల్లిస్తామని చెబుతూ వచ్చాడు. అయితే ఏడాది నుంచి అద్దె రాకపోవడం, ఇల్లు కూడా ఖాళీ చేయక పోవడంతో సామాన్లు బయటికి పడేసేందుకు ఇంటి ఓనర్ రమేష్ వెళ్లి చూసి షాకయ్యాడు. వెంటనే పోలీసులకుసమాచారం అందించడంతో హత్య విషయం వెలుగుచూసింది.

మహిళ డెడ్ బాడీ కుళ్లిపోయి కనిపించిందని తెలియగానే పోలీసులు 5 టీమ్‌లుగా ఏర్పడి విశాఖ నగరంతో పాటు పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గాలించి చివరకు నిందితుడు రిషిని అదుపులోకి తీసుకున్నట్లు విశాఖ సీపీ శ్రీకాంత్ చెప్పారు.త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

Exit mobile version