Site icon Prime9

Telangana: నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి పై రేప్ కేసు నమోదు

congress-leader-shivakumar-reddy

Hyderabad: తెలంగాణలోని నారాయణపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి పై పంజాగుట్ట పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. శివకుమార్ రెడ్డి తనకు మద్యం తాగించి, నగరంలోని ఓ హోటల్ లో తనపై అత్యాచారం చేశారని, ఆ తర్వాత అదంతా రికార్డు చేశానని చెప్పి బెదిరించాడని బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తాను కాంగ్రెస్ పార్టీలో సభ్యురాలిగా ఉన్నానని, 2020లో జరిగిన మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి పార్టీని సమన్వయం చేసే బాధ్యతలు నిర్వహించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

ఈ క్రమంలో ఆయన నాతో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించారు. నా ఫోన్ కు తరచూ మెసేజ్ లు పంపించేవారు. చివరగా ఒక సందర్భంలో పెళ్లి చేసుకుంటానని చెప్పారు. కానీ, అప్పటికే ఆయనకు పెళ్లయిన విషయాన్ని ప్రశ్నిస్తే, తన భార్య తీవ్ర అనారోగ్యంతో ఉందని, మూడేళ్లకు మించి బతకదన్నారు. తనకు తోడు అవసరమని బదులిచ్చారు’ అని ఆమె ఫిర్యాదులో పేర్కొందని పోలీసులు తెలిపారు. పార్టీ పని నిమిత్తం వారిద్దరూ దుబ్బాకలో ఉన్న సమయంలో, శివకుమార్ రెడ్డి మద్యం మత్తులో తన గదికి వచ్చి తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి చేసి అంగీకరించకపోవడంతో, తనపై దాడికి పాల్పడ్డాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం శివకుమార్ రెడ్డి ఆమె మెడలో పసుపు తాడు కట్టి పెళ్లి చేసుకున్నట్టు నమ్మించే ప్రయత్నం చేశారని పోలీసులు తెలిపారు.

మాట్లాడుకుందామని ఓ ప్రముఖ హోటల్‌కు పిలవడంతో మహిళ అక్కడికి వెళ్లిందని, అక్కడ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి, ఆమెపై అత్యాచారం చేసి దానిని ఫోన్ లో రికార్డు చేశారని పోలీసులు తెలిపారు. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే, చెప్పినట్టు వినకపోతే ఫొటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతానని శివకుమార్ బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొనట్టు వెల్లడించారు.

Exit mobile version