Site icon Prime9

Tamil Actress: సినీనటి దీప ఆత్మహత్య… తన చావుకి ఎవరూ బాధ్యులు కారంటూ..!

actress Deepa suicide

actress Deepa suicide

Tamil Actress: తమిళ చిత్రపరిశ్రమకు చెందిన యువనటి ఆత్మహత్య చేసుకుంది. సహాయనటిగా వివిధ పాత్రల్లో మెప్పించిన దీప అలియాస్ పౌలిన్ శనివారం చెన్నైలోని విరుగంబాక్కంలోని మల్లికై అవెన్యూలోని తన నివాసంలో ఉరి వేసుకుని చనిపోయింది. గత కొద్దిరోజులుగా దీప మానసిక ఒత్తిడికి గురైందని కొందరు స్నేహితులు చెప్తున్నారు. కాగా ప్రేమ వ్యవహరమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

పోస్ట్ మార్టం నిమిత్తం దీప మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు దీప ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిన్నటి నుంచి దీప ఆమె కుటుంబసభ్యులకు అందుబాటులో లేదని.. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చెయ్యలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆమె స్నేహితుడు ప్రభాకరన్ ఇంటికి వెళ్లి చూడగా.. దీప ఫ్యాన్‏కు ఉరివేసుకుని కనిపించింది. ఆమె వద్ద దొరికిన సూసైడ్ నోట్‏లో తాను జీవితాంతం ఒకరినే ప్రేమిస్తానంటూ రాసుకొచ్చింది. కానీ అతని పేరును మాత్రం ప్రస్తావించలేదు. తన ఆత్మహత్యకు ఎవరు కారణం కాదంటూ ఆత్మహత్య లేఖలో రాసింది.

ఇదీ చదవండి: Chandigarh University: 60 మంది అమ్మాయిల బాత్రూం వీడియోలు లీక్… ఆ యూనివర్సిటీలో హైటెన్షన్

Exit mobile version