Site icon Prime9

Madya Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది వలస కూలీలు మృతి

road accident in madya pradesh

road accident in madya pradesh

Madya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ వేగంగా దూసుకొచ్చిన బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు.

మధ్యప్రదేశ్ రీవా జిల్లాలో లారీ బస్సు ఢీ కొట్టిన ఘటనలో 14 మంది మృతిచెందగా మరో 40 మంది గాయపడ్డారు. ఈ ప్రమాద ధాటికి బస్సు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతులని ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలుగా పోలీసులు గుర్తించారు. దీపావళి పండుగ సందర్భంగా వారంతా తమ స్వస్థలాలకు వెళ్తున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి: జరభద్రం.. గీజర్ పేలి నవదంపతులు మృతి

 

Exit mobile version
Skip to toolbar