Site icon Prime9

Mobile Phones: మొబైల్ ఫోన్ల ఛోరీ కేసును ఛేదించిన పోలీసులు.

Police solved the case of theft of mobile phones

Police solved the case of theft of mobile phones

CP Mahesh Bhagawath: భాగ్యనగరంలో భారీ సెల్ ఫోన్ల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. అంతరాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పొడే ముఠా పనిగా తేల్చారు. నిందితులను పట్టుకొనే క్రమంలో పోలీసులపై కాల్పులకు కూడా నిందుతులు పాల్పొడ్డారు. చివరకు హైదరాబాదు పోలీసులకు చిక్కారు.

ఈ మేరకు రాచకొండ సీపి మహేష్ భగవత్ మీడియాకు వివరించారు. గత నెల 21న కుషాయిగూడ పీఎస్ పరిధిలో ఈసిఐఎల్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ షోరూంలో ఛోరీ జరిగింది. రూ. 70లక్షల విలువచేసే 432 సెల్ ఫోన్లను నిందుతులు దోచుకెళ్లారు. రంగంలోకి దిగిన సీసిఎస్, ఎస్వోటీ, క్లూస్ టీం లు విచారణ ముమ్మరం చేశారు. సాంకేతికత ద్వారా 500కు పైగా సీసీ ఫుటేజ్ లు పరిశీలించారు. కేసును పలు కోణాల్లో విచారించారు.

బీహార్, జార్ఖండ్ ప్రాంతాలకు చెందిన అలం గ్యాంగ్ బజాజ్ అలియెన్స్ షోరూం వద్ద రెక్కీ నిర్వహించిన్నట్లు గుర్తించారు. మొత్తం 6గురు వ్యక్తులు ఛోరీలో పాల్గొన్నారు. వీరిని పట్టుకొనేందుకు జార్ఖండ్ వెళ్లిన పోలీసులపై వారు కాల్పులు జరిపారు. 4గురు వ్యక్తులు పరారీ కాగ, ఇద్దరు దొంగలు వీరికి చిక్కారు. వారిలో సత్తార్ షేక్, ఆసీదుల్ షేక్ లుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఓ వ్యక్తి గాయపడ్డాడు.

పట్టుబడ్డ నిందుతులను పీటీ వారెంట్ పై జార్ఖండ్ నుండి హైదరాబాదుకు తీసుకొచ్చారు. దోపిడీ పాల్పొడిన దొంగల ముఠా పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పొడిన్నట్లు పోలీసుల విచారణ తేలింది. ఛోరీ కేసును ఛాలెంజ్ గా తీసుకొన్న పోలీసులు 7రోజుల పాటు విచారణ చేసి కేసును ఛేదించిన్నట్లు సీపి మహేష్ భగవత్ మీడియాతో పేర్కొన్నారు. ఛోరీ చేసిన మొబైల్స్ ను నేపాల్, బంగ్లాదేశ్ ప్రాంతాల్లో అమ్ముతున్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం రెండు మొబైల్ ఫోన్లు, రూ. 80వేల రూపాయల నగదును మాత్రమే స్వాధీనం చేసుకొన్నారు.

ఉత్తర ప్రదేశ్ గాజీపూర్ యూనియన్ బ్యాంక్ లో కూడా రూ. 2కోట్ల విలువచేసే బంగారు ఆభరణాలను గతంలో నిందితులు ఛోరీ చేసివున్నారు. బంగ్లాదేశ్ కు సరిహద్దు 3కి.మీ దూరంలో నిందుతుల నివాసం ఉంటున్నారు. బ్యాంకులు, బంగారు దుకాణాలు, మొబైల్ షాపులను లూఠీ చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.

ఇది కూడా చదవండి:Bank Robbery: రూ.12 కోట్లు కొల్లగొట్టిన బ్యాంక్ ఉద్యోగి

Exit mobile version