జైపూర్: పెద్దమ్మను చంపి 10 ముక్కలుగా నరికి హైవేపై పడేసిన వ్యక్తి..

తన పెద్దమ్మను చంపి, పాలరాతి కట్టర్‌తో ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఢిల్లీ హైవేకి సమీపంలోని వివిధ ప్రదేశాలలో పడేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - December 18, 2022 / 06:20 PM IST

Jaipur: తన పెద్దమ్మను చంపి, పాలరాతి కట్టర్‌తో ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి, ఢిల్లీ హైవేకి సమీపంలోని వివిధ ప్రదేశాలలో పడేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అనుజ్ శర్మ అలియాస్ అచిత్య గోవింద్ దాస్ (33) మృతదేహాన్ని పారవేసేందుకు గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించి వాస్తవాలను దాచడానికి ప్రయత్నించాడని పోలీసులు తెలిపారు.జైపూర్ కు చెందిన అనుజ్ శర్మ వయసు 32 ఏళ్లు, బీటెక్ పూర్తి చేశాడు. అతను 2013 నుండి హరే కృష్ణ ఉద్యమంతో అనుబంధం కలిగి ఇస్కాన్‌తో పని చేస్తున్నాడు. చిన్న చిన్న గొడవల కారణంగానే అతడు ఇలా చేశాడని విచారణలో తేలిందని, అతడు సైకో అని తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

నిందితుడు తన పెద్దమ్మ సరోజ్ శర్మ కనిపించడం లేదని డిసెంబర్ 11న పోలీసులకు సమాచారం అందించాడు మరియు జైపూర్‌లోని ఇతర బంధువులతో కలిసి సోదాల్లో పాల్గొన్నాడు.విచారణలో, అతను ఆమెను సుత్తితో కొట్టి చంపినట్లు అంగీకరించాడు. మరణించిన సరోజ్ శర్మ అతని తండ్రి అన్నయ్య భార్య. 1995లో తన భర్త మరణించిన తర్వాత వారితో కలిసి జీవిస్తోంది. అనూజ్ శర్మ తల్లి గత సంవత్సరం మరణించింది.డిసెంబరు 11న ఇండోర్ వెళ్లేందుకు అనుజ్ శర్మ తండ్రి వెళ్లాడని అధికారులు తెలిపారు. ఆ రోజు అనూజ్ ఢిల్లీకి వెడతానని చెప్పగా ఆమె నిరాకరించింది. ఇది తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.

దీనితో అతను వంటగదిలో సుత్తితో ఆమెను కొట్టాడని పోలీసులు తెలిపారు.నిందితుడు మృతదేహాన్ని బాత్‌రూమ్‌లోకి లాగి మార్బుల్ కట్టర్‌తో 10 ముక్కలుగా నరికాడు. నిందితుడు శరీర భాగాలను సూట్‌కేస్‌లో తీసుకుని ఢిల్లీ హైవేపై ప్రత్యేక ప్రదేశాల్లో పడేశాడు. చాలా శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దేశ్‌ముఖ్ తెలిపారు.