Site icon Prime9

Parking dispute: పార్కింగ్‌ వివాదం.. ఇటుకతో దాడిచేసి తల పగులగొట్టాడు..

Parking dispute

Parking dispute

Ghaziabad: ఘజియాబాద్ లో మంగళవారం సాయంత్రం ఒక దాబావద్ద కారు పార్కింగ్‌ విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం హత్యకు దారి తీసింది. ఓ వ్యక్తిని మరో వ్యక్తి ఇటుకతో తలను పగులగొట్టి చంపాడు.

మంగళవారం రాత్రి వరుణ్ (35) అనే వ్యక్తి తన కారును దాబా బయట పార్క్ చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పక్కనే ఉన్న వాహనం తలుపులు తెరవలేని విధంగా కారు పార్క్ చేసినట్లు సమాచారం. దీంతో వరుణ్‌కి, మరో కారులో ఉన్న వారికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం తీవ్ర ఘర్షణగా మారడంతో వరుణ్‌ పై అవతలి పక్షం వ్యక్తి ఇటుకతో దాడిచేసాడు. తీవ్ర గాయాలతో కింద పడిపోయిన వరుణ్‌ను అక్కడే వదిలేసిన నిందితుడు తన స్నేహితులతో కలిసి పరారయ్యాడు.

స్దానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం ఐదు బృందాలతో గాలిస్తున్నట్లు తెలిపారు. వరుణ్ డైరీ వ్యాపారం చేస్తుండగా అతని తండ్రి మాజీ పోలీస్ ఉద్యోగి అని తెలుస్తోంది.

Exit mobile version
Skip to toolbar