Site icon Prime9

Hyderabad: పండుగ పూట క్షుద్రపూజల కలకలం.. వ్యక్తిని కాల్చి బూడిద చేసిన దుండగులు

occult worship in Hyderabad

occult worship in Hyderabad

Hyderabad: ఎంత చదువుకున్నా మూఢనమ్మకాలను మాత్రం వదలడం లేదు కొందరు మనుషులు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కూడా ఇంకా మనుషుల మదిలో మాత్రం మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. క్షుద్రపూజలంటూ అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఈ తరహా ఘటనే ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌ లోని కూకట్‌ పల్లి కేపి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో క్షుద్ర పూజలు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ యుకుడిని చంపి శవాన్ని కల్చేశారు గుర్తు తెలియని కొందరు దుండగులు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే హైదర్ నగర్లోని అలీ తలాబ్ స్మశాన వాటిక వద్ద గుర్తు తెలియని శవం మంటల్లో కాలుతూ కనిపించింది. దానిని చూసి భయాందోళనకు గురయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. శవాన్ని ఎవరో హత్యచేసి కాల్చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
రేపు అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కావడంతో మరియు పరిసర ప్రాంతాలలో క్షుద్ర పూజలు జరిగినట్లు ఆనవాళ్లు కనిపిస్తూ ఉండటం వల్ల పోలీసులు క్షుద్ర పూజలు చేసి బలి ఇచ్చి, శవాన్ని కల్చేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన యువకుడు ఎవరు అన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: పెళ్లికి నిరాకరించిందని బాలికపై కర్రలతో దాడి చేసిన యువకుడు

Exit mobile version