Site icon Prime9

Saipriya murder case: ప్రియుడే కాలయముడు.. సాయిప్రియ హత్యకేసులో వీడిన మిస్టరీ

mystery left in the Saipriya murder case

Saipriya murder Case : హైదరాబాద్‌లో అదృశ్యమైన యువతి సాయిప్రియ కథ విషాదాంతమైంది. నాలుగు రోజుల క్రితం సాయిప్రియ హైదరాబాద్ నుంచి అదృశ్యమై.. వనపర్తిలో శవమై కనిపించింది. ఆమెను ప్రియుడే దారుణంగా హతమార్చాడు. సాయిప్రియను హత్య చేసి వనపర్తి సమీపంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు శ్రీశైలం. గతంలో సాయి ప్రియ, శ్రీశైలం ప్రేమించుకున్నారు. అయితే విషయం ఇంట్లో తెలియడంతో సాయిప్రియ తల్లి దండ్రులు వారించారు. దీంతో సాయి ప్రియ అతనికి దూరంగా ఉంటూ వచ్చింది.

అయినప్పటికీ శ్రీశైలం.. సాయిప్రియను మర్చిపోలేకపోయాడు. తరచూ ఆమెకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందామని వేధించినట్లు తెలుస్తోంది. ఆమె నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 4న ఫోన్ చేసి.. చివరిసారిగా ఒకసారి మాట్లాదామని చెప్పి మహబూబ్ నగర్‌కు రావాల్సిందిగా కోరాడు. అతడి మాటలు నమ్మిన సాయిప్రియ.. మహబూబ్ నగర్‌ వెళ్లింది. తనను వివాహం చేసుకోవాలని సాయిప్రియపై శ్రీశైలం ఒత్తిడి తీసుకొచ్చాడు. పెళ్లికి ఆమె ససేమిరా అనడంతోనే ఆగ్రహానికి గురైన శ్రీశైలం సాయిప్రియను హతమార్చాడు.

సాయిప్రియ కనిపించకపోవటంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాలుగు రోజులుగా సాయిప్రియ కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. చివరికి వనపర్తిలో సాయిప్రియ ఆచూకీ కనిపెట్టారు పోలీసులు. ఆమె మృతదేహాన్ని వెలికి తీశారు.

Exit mobile version