Site icon Prime9

Murder Case : కట్టుకున్న భర్తను ఐదు ముక్కలుగా నరికి కాలువలో విసిరేసిన భార్య.. ఎందుకంటే?

Murder News about killing women husband with synoid injections in peeleru

Murder News about killing women husband with synoid injections in peeleru

Murder Case : ఉత్తరప్రదేశ్‌లో కట్టుకున్న భర్తను.. భార్య ఐదు ముక్కలుగా నరికి కాలువలో విసిరేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. పిలిభిత్‌ లోని గుజ్రాలా ప్రాంతంలో గల శివ నగర్‌ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న రాంపాల్ కు భార్య, కుమారుడు ఉన్నారు. అతని వయస్సు 55 సంవత్సరాలు. కాగా అతని భార్య  దులారో దేవి కొన్ని రోజులుగా.. తన భర్త స్నేహితుడితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలోనే నెల రోజుల క్రితం ఆమె తిరిగి మళ్ళీ గ్రామానికి చేరుకుంది.

అయితే ఊహించని రీతిలో తన భర్త కనిపించడం లేదంటూ కుమారుడికి చెప్పింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దులారో దేవి ప్రవర్తనను అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. తమదైన రీతిలో విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెళ్లడయ్యాయి. భర్తను తానే చంపేసినట్టు దేవి అంగీకరించింది. గత ఆదివారం రాత్రి భర్త నిద్రపోయిన తర్వాత మంచానికి కట్టేసి గొడ్డలితో నరికి చంపానని.. ఆ తర్వాత ఐదు ముక్కలుగా కోసి సమీపంలోని కాలువలో పడేసినట్టు తెలిపింది.

ఇక ప్రస్తుతం పోలీసులు మృతుడి శరీర భాగాల కోసం కాలువలో గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. దేవి అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఊహించని ఈ దారుణ ఘటన ఆ గ్రామంలో అందర్నీ షాక్ కి గురి చేసింది.

Exit mobile version