Site icon Prime9

Monda Market Robbery: సూర్య ‘గ్యాంగ్’.. అక్షయ్ ‘స్పెషల్ 26’ సినిమాలు చూసే గోల్డ్ చోరీకి ప్లాన్

Monda Market Robbery

Monda Market Robbery

Monda Market Robbery: ఐటీ అధికారులమని చెప్రి సికింద్రాబాద్‌ మోండా మార్కెట్‌లోని బాలాజీ జ్యూవెల్లర్స్‌లో పట్ట పగలు భారీ దోపిడి జరిగిన విషయం తెలిసిందే. ఈ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాలోని నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 7 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ మీడియాకు వెల్లడించారు.

షాపులో వ్యక్తి సమాచారంతోనే(Monda Market Robbery)

‘ఎప్పుడూ రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ పాట్‌ మార్కెట్‌లోని బాలాజీ జ్యూవెలర్స్‌కు ఈ నెల 27వ తేదీ ఉదయం ఆరుగురు నిందితులు వచ్చి ఐటీ అధికారులమని చెప్పి సిబ్బందిని ఓ గదిలో ఉంచారు. తనిఖీల చేస్తున్నట్టు చెప్పి కార్ఖానాలో ఉన్న 17 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకుని పరారీ అయ్యారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిందితులు జాగ్రత్తలు తీసుకోవడంతో కేసు దర్యాప్తు పోలీసులకు ఇబ్బంది గా మారింది. మొత్తం సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించాము. నగల దుకాణంలో పనిచేసే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో దొంగలు నగరానికి వచ్చినట్టు అంచనాకు వచ్చాము.

 

ఆ సినిమాలే చోరీ చేసేలా

ఖానాపూర్‌కు చెందిన జాకీర్ అనే వ్యక్తి రంజాన్ తర్వాత ఇక్కడ పనిలో చేరాడు. అతడు ఇచ్చిన సమాచారంతో చోరీకి ఈ ముఠా ప్లాన్‌ చేసింది. జాకీర్‌ నుంచి వివరాలు సేకరించి.. మహారాష్ట్రలోని ఖానాపూర్‌ వెళ్లి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నాం. వారి నుంచి 7 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకోగా.. మరో 6గురు నిందితులను అరెస్టు చేసి మిగిలిన 10 బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. నిందితుల కోసం ప్రత్యేక టీమ్ లు మహారాష్ట్రలో గాలిస్తున్నాయి. కాగా, తమిళ హీరో సూర్య నటించిన ‘ గ్యాంగ్ ‘ , అక్షయ్ కుమార్ నటించిన ‘స్పెషల్ 26’ సినిమాలు చూసి చోరికి ప్లాన్ చేసినట్టు నిందితులు విచారణలో వెల్లడించారు’ అని సీపీ సీవీ ఆనంద్‌ వెల్లడించారు.

 

Exit mobile version