Site icon Prime9

UP Crime News: దారుణం… రక్తం కారుతూ నగ్నంగా రోడ్డుపై పరుగెత్తిన మైనర్ బాలిక..!

minor girl rape case in eluru district andhra pradesh

minor girl rape case in eluru district andhra pradesh

UP Crime News: ఉత్తరప్రదేశ్లో నేరాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయని చెప్పవచ్చు. మొన్నామధ్య మైనర్ దళిత బాలికలైన అక్కాచెళ్లెల్లపై అత్యాచారం చేసి చెట్టుకు వేలాడదీసిన ఘటన మరువకముందే అదే తరహా ఘటన మరొకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని మొరాదాబాద్​ జిల్లా ఓ మైనర్ బాలికపై కొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఆ బాలిక సృహలోకి వచ్చిన తర్వాత రక్తం కారుకుంటూ నగ్నంగా రోడ్డుపై నడుచుకుంటూ తన ఇంటికి చేరుకుంది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ జిల్లా భోజ్​పుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో 15 ఏళ్ల బాలిక.. సెప్టెంబర్​ 1వ తేదీన పక్క గ్రామంలో జరుగుతున్న సంత చూడడానికి వెళ్లింది.
అయితే ఆ బాలిక తిరిగి వస్తుండగా ఆమెను నలుగురు వ్యక్తులు ఓ నిర్మానుష్య ప్రదేశానికి ఎత్తుకెళ్లారు. బాలికను వివస్త్రను చేసి, ఒకరి తర్వాత ఒకరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి వారు పరారయ్యారు. తర్వాత బాధితురాలు అలానే అక్కడి నుంచి నగ్నంగా నడుచుకుంటూ ఇంటికి వెళ్లి.. కుటుంబసభ్యులకు జరిగినదంతా చెప్పింది. ఇలా వెళ్లడాన్ని ఎవరో వీడియో తీశారు. ఆ వీడియో క్లిప్‌ను ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో
ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

కాగా ఈ కేసు నమోదు చేసే విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఘటన జరిగిన వెంటనే బాధితురాలు, కుటుంబంతో కలిసి పోలీస్ స్టేషన్​కు వెళ్లి, ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయలేదని కొందరు అంటున్నారు. అయితే వారం తర్వాత ఎస్​ఎస్​పీ హేమంత్​ కుటియాల్​ను కలవగా.. అప్పుడు కేసు పెట్టారని మరికొందరు చెప్తున్నారు. తన మేనకోడలిపై అత్యాచారం జరిగిందని ఓ వ్యక్తి సెప్టెంబర్ 7న ఫిర్యాదు చేశాడని మేము దర్యాప్తు ప్రారంభించాం కానీ.. అలాంటిదేమీ లేదని బాలిక తల్లిదండ్రులు చెప్పారని మొరాదాబాద్ ఎస్​పీ(గ్రామీణ) సందీప్ కుమార్ మీనా తెలిపారు. అయినా తాము దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఒకరిని అరెస్టు చేశామని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: Khammam Injection Murder: ఇంజెక్షన్ హత్య… సూత్రధారి భార్యే… పథకం ప్రకారమే..!

Exit mobile version