Site icon Prime9

Uttar Pradesh: కళ్లెదుటే భార్య చనిపోతుంటే వీడియో తీసిన ప్రబుద్ధుడు.. ఎంత దారుణమో..!

Basara IIT

Basara IIT

Uttar Pradesh: భార్యాభర్తలన్నాక గొడవలు సహజం. గొడవపడిన భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే కాస్తైన ప్రేమ ఉన్న వ్యక్తి ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ ప్రబుద్ధుడు మాత్రం భార్య ఉరిపోసుకుంటే అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు సరికదా దానిని వీడియో తీశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే కాన్పూర్‌కి చెందిన శోభిత గుప్తా, సంజయ్ గుప్తాలకు ఐదేళ్ల క్రితం వివాహమయ్యింది. కాగా వీరిరువురి మధ్య మంగళవారం గొడవ జరిగింది. దానితో ఆమె చున్నీతో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో భార్యను ఆపడానికి ప్రయత్నించకుండా తన మొబైల్ ఫోన్‌లో వీడియో తీశాడు సంజయ్ గుప్తా. భార్య కళ్లెదుటే ఉరి బిగిసుకుని కనుగుడ్లు తేలేసినా చోద్యం చూస్తూ ఉండిపోయాడు. అంతే కాకుండా ‘నువ్వు ఇంతే.. నీ ఆలోచన విధానం ఇది.. చాలా చెత్త మనస్తత్వం’అంటూ తనని తిట్టాడు. తను రికార్డు చేసిన వీడియోలో ఈ మాటలు రికార్డయ్యాయి.

ఇదిలా ఉంటే తర్వాత సంజయ్, శోభతి తండ్రి రాజ్ కిశోర్ గుప్తాకు ఫోన్ మీ కూతురు ఆత్మహత్య చేసుకుందని సమాచారం ఇచ్చాడు. కాగా ఆమె కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకునేసరికి బెడ్‌పై ఉన్న శోభితకు సంజయ్ గుప్తా సీపీఆర్ చేసినట్టు తెలుస్తోంది. వెంటనే ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. సంజయ్ గుప్తా తన అత్తమామలకు తాను తీసిన వీడియోను చూపించి, ఆమెను రక్షించాడానికి ప్రయత్నించినట్టు చెప్పాడు. దానితో అల్లుడి ప్రవర్తన చాలా అనుమానాస్పదంగా ఉందని మృతురాలి తండ్రి ఆరోపించారు.

ఆస్పత్రికి తీసుకెళ్లాల్సింది పోయి వీడియో తీశాడని, అది చూపిస్తూ గతంలోనూ ఆమె ఒకసారి ఇలాగే చేస్తే అడ్డుకున్నానని చెప్పాడు.. ఇప్పుడు మాత్రం ఆపకుండా వీడియో తీశాడని శోభిత తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ఈ ఘటన జరుగగా, కుమార్తె మృతి వెనుక అల్లుడి హస్తం ఉందని అనుమానం ఉందని పోలీసులకు రాజ్ కిశోర్ గుప్తా వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి: పరువు హత్య.. ప్రేమించిందని కన్న కూతురినే కడతేర్చిన తండ్రి

Exit mobile version