License For Traders: ఇకపై హైదరాబాద్ లో వ్యాపారం చేయాలంటే లైసెన్స్ తీసుకోవాలంటున్నారు పోలీసులు.
నగరంలో వరుస ప్రమాదాలతో అప్రమత్తమైన పోలీసులు ఇక నుంచి లైసెన్స్ విధానాన్ని అమలులోకి తెచ్చారు.
2014 తర్వాత ఈ లైసెన్స్ విధానాన్ని రద్దు చేసిన సిటీ పోలీసులు మళ్లీ ఈ నిబంధన తీసుకొచ్చారు.
ఈ లైసెన్స్ ప్రకారం నగరంలో వ్యాపారం చేయాలంటే ట్రెడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్, అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ తో పాటు ఇపుడు పోలీసు లైసెన్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది.
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ పోలీసు లైసెన్స్ నిబంధన తీసుకొచ్చిన పోలీసులు .. అసలు ఎవరు ఈ లైసెన్స్ తీసుకోవాలనే దానిపై క్లారిటీ ఇచ్చారు.
స్టార్ హోటల్స్, బార్ అండ్ రెస్టారెంట్స్, పబ్స్, కాఫీ షాపులు, బేకరీ, టీ స్టాల్, కేఫ్ లు, ఐస్ క్రీమ్ పార్లర్, స్వీట్ షాపులు , జ్యూస్ సెంటర్లు, సినిమా థియేటర్స్, పెట్రోలియం ఉత్పత్తుల షాపులు, ఫైర్ క్రాకర్స్
ఇలా అన్ని రకాలు షాపులు తప్పనిసరిగా పోలీసు లైసెన్స్ తీసుకోవాలి.
ఈ లైసెన్స్ కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాపారులు hyderabadpolice.gov.in వెబ్ సైట్ లో లాగిన్ అవ్వాలి.
అందులో చేయాలనుకుంటున్న వ్యాపారాన్ని బట్ట రూ. 1000 నుంచి రూ. 15000 వరకూ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఆన్ లైన్ లో దరఖాస్తు చేసేందుకు ముందుగా జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్, అద్దె, ఇతర ఒప్పంద పత్రాలను జత చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ఏప్రిల్ 1 నుంచి ఈ లైసెన్స్ లు జారీ చేస్తారు.
కాగా, నగరంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలతో అప్రమత్తమైన పోలీసులు రూల్స్ మరింత కఠినతరం చేశారు. ఇటీవల సికింద్రాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
మినిస్టర్ రోడ్డులోని డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ లో ఈ ప్రమాదం జరిగింది. భారీగా ఎగసిపడి సమీపంలోని నాలుగు భవనాలకు మంటలు వ్యాపించాయి.
మరో వైపు ప్రమాదం జరిగిన ఆరు అంతస్థుల బిల్డింగ్ ఎపుడు కూలుతుందో అని ఆందోళనకరంగా మారింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు.
అంతే కాకుండా మంటలు ఆర్పేందుకు పదుల సంఖ్యలో అధికారులు 18 గంటలు శ్రమించాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన భవనం నిబంధనలకు విరుద్ధంగా ఉందని అధికారులు గుర్తించారు.
గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. అపుడు కూడా అధికార యంత్రాంగం పరుగుుల పెట్టాల్సి వచ్చింది.
అందుకోసమే ఇకపై కఠన నిబంధనలు తీసుకురావాల్సి వచ్చింది. కాబట్టి వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ తో పాటు పోలీసుల అనుమతి కూడా తీసుకోవాలి.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/