Site icon Prime9

Crime News : చిత్తూరు జిల్లాలో దారుణం.. చపాతీ విషయంలో గొడవై సుత్తితో ఇద్దరిపై దాడి.. ఒకరి మృతి

latest crime news in chittoor district details

latest crime news in chittoor district details

Crime News : చపాతీల విషయంలో జరిగిన చిన్న గొడవ ప్రాణాలు తీసే వరకు వెళ్ళడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ ఊహించని ఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ గహతన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఒడిశా రాష్ట్రానికి చెందిన లక్కీరామ్ ముర్మా, సతీష్, బావర్ సింగ్.. చేర్లోపల్లి లోని గ్రానైట్ కంపెనీలో పని చేస్తున్నారు. అయితే గత రాత్రి లక్కీ రామ్, సతీష్ నిద్రిస్తున్న సమయంలో.. బావర్ సింగ్ వారిపై సుత్తితో దాడి చేశాడు. ఘటనలో సతీష్‌ అక్కడికక్కడే మృతిచెందినట్టు తెలుస్తుండగా.. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం అందుతుంది. కాగా విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అందుపులోకి తీసుకొని విచారించగా.. అసలు ఎందుకు దాడి చేశాడో చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఖంగుతిన్నారు.

గ్రానైట్ ఫ్యాక్టరీలో చేసే పని తక్కువ నువ్వు చపాతీలు తినేది ఎక్కువ.. అంటూ భావర్ సింగ్ తో గొడవపడిన సమయంలో లక్కీ రామ్ ముర్మా, సతీష్ హేళన చేశారట. అయితే, అది మనసులో పెట్టుకున్న బావర్‌ సింగ్.. లక్కీరామ్‌ ముర్మా, సతీష్ నిద్రిస్తున్న సమయంలో దాడి చేశాడు.. ఈమొత్తంగా చపాతీ విషయంలో జరిగిన గొడవ ఓ వ్యక్తి ప్రాణాలు తీసేంత వరకు వెళ్లడం కలకలం సృష్టిస్తోంది. సాధారణంగా ఒకరిపై మరొకరు సరదాగా జోక్స్ వేసుకోవడం సర్వసాధారణం. అలాంటిది ఈ తరహా ఘటనలు జరగడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది.

Exit mobile version