Site icon Prime9

Crime News : పదో తరగతి బాలికపై అత్యాచారం.. బిడ్డ పుట్టాక వెలుగులోకి వచ్చిన ఘటన

latest crime news about teacher rape 10th class student at kadiri constituency

latest crime news about teacher rape 10th class student at kadiri constituency

Crime News : మన దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. రాను రాను సమాజం ఇలా తయారు అవుతుంది ఏంటి.. మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇప్పుడు తాజాగా విద్య నేర్పించి.. మంచి, చెదుల గురించి అవగాహన కల్పించాల్సిన ఓ టీచర్.. 10 వ తరగతి విద్యార్ధిని పట్ల దారుణానికి ఒడిగట్టాడు.

ఇటువంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నప్పటికి.. విద్యార్థులను సరైన దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయులే.. ఇలా దారి తప్పి ప్రవర్తించడం పట్ల అందరూ విస్మయానికి గురవుతున్నారు. ఈ ఘటనే ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వెలుగు చూసింది. నియోజకవర్గ పరిధి లోని ఓ పాఠశాలలో ఓ పదహారేళ్ల బాలిక ఏడాది కిందట పదవ తరగతి చదువుతుండేది. కాగా స్కూల్ లో ఉన్న సమయంలో దాహం వేసి నీళ్లు తాగడానికి స్టాఫ్ గదిలోకి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడే ఉన్నరెడ్డి నాగయ్య అనే టీచర్ ఆ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు.

అయితే విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను తీవ్రంగా బెదిరించాడు. దీంతో బాలిక భయంతో మిన్నకుండిపోయింది. దీన్ని అదునుగా తీసుకున్న ఆ కీచక ఉపాధ్యాయుడు.. ఆ బాలికపై అనేకమార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో 14 వ తేదీన బాలిక కడుపునొప్పితో బాధపడింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తేల్చి.. ప్రసవం చేసి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు.

అయితే బాధితురాలికి రక్తం తక్కువగా ఉండడంతో ఆమెను కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించాలని తల్లిదండ్రులకు సూచించారు. వైద్యుల సూచన మేరకు ఆమెను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స అందిస్తుండగా విషయం పోలీసులకి, మీడియాకి తెలియడంతో జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న కదిరి డీఎస్పీ శ్రీలత బాధితురాలిని పరామర్శించి.. ఆమె తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం, 376, 506 సెక్షన్ల కింద నిందితుడి మీద కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు.

Exit mobile version