Site icon Prime9

Crime News : నంద్యాల జిల్లాలో దారుణం.. పూలు కోసుకోమని పిలిచి.. 17 ఏళ్ల బాలికపై అత్యాచారం !

latest Crime News about 17 years girl rape in nandyal district

latest Crime News about 17 years girl rape in nandyal district

Crime News : నంద్యాల జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ ఇంటి పెరట్లో పూలు ఉన్నాయని, వచ్చి కోసుకెళ్లమని నమ్మించి 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. మొదట ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో సెటిల్ మెంట్ చేసేందుకు యత్నించగా.. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

జూపాడుబంగ్లా మండలం తంగడంచలో హరికుమార్‌ గౌడ్‌ అనే వ్యక్తి.. సమీపంలో నివసిస్తున్న బాలికను తమ ఇంటి పెరట్లో పూలు ఉన్నాయని, వచ్చి కోసుకెళ్లమని నమ్మించి ఆపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటన తర్వాత బాధితురాలు తమ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పింది. 20 రోజుల క్రితం పెద్దమనుషుల సమక్షంలో బాలిక తల్లిదండ్రులు పంచాయితీ చేశారు. కాగా పంచాయితీలో బాలికను పెళ్లి చేసుకుంటానని హరికుమార్ గౌడ్ చెప్పడంతో వివాదం సద్దు మణిగింది.

rape case

కానీ ఇప్పుడు మళ్ళీ బాలికను పెళ్లి చేసుకోవడానికి హరికుమార్‌ గౌడ్ నిరాకరించడంతో పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హరికుమార్‌ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar