Site icon Prime9

Kadapa Road Accident: విషాదాంతంగా మారిన విహారయాత్ర.. దైవదర్శనానికి వెళ్లివస్తూ 7 మంది మృతి

Road Accident in adilabad district leads to 4 death

Road Accident in adilabad district leads to 4 death

Kadapa Road Accident: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ఏకంగా దేవుడి దగ్గరకే చేరారు ఆ యాత్రికులు. విహారయాత్ర కాస్త విషాదాంతంగా మారింది. ఎదురుగా వస్తున్న లారీని తుఫాన్ ఢీకొట్టడంతో ఈ జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక పాప, ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కడప జిల్లా కొండాపురం మండలం ఏటూరు గ్రామం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా తాడిపత్రి వాసులు, కర్ణాటకలోని బళ్లారికి చెందిన 14 మంది బంధువులు కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికి తుఫాన్ వాహనంలో వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యలు చెప్తున్నారు. మృతులంతా కూడా తాడిపత్రికి చెందిన వారిగా అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న సీఐ సుదర్శన్ ప్రసాద్, ఎస్ఐ సత్యనారాయణ ఘటనా స్థలికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శోకసంద్రంలో తాడిపత్రి(Kadapa Road Accident)

మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. కే సుధీర్ కుమార్ (తుఫాన్ డ్రైవర్), కే సుధ, కే లికిత్ కుమార్ రెడ్డి, ఎల్ లక్ష్మీదేవి, కే సునీల్ కుమార్ రెడ్డి, సుభద్ర, రెండేళ్ల చిన్నారి బుజ్జి. మృతి చెందిన వారంతా తాడిపత్రికి చెందిన వారే కావడం గమనార్హం. అయితే వీరిలో కొంతమంది బళ్లారి జిల్లా కంఫ్లీ‌లో నివాసం ఉంటున్నట్ట అక్కడి స్థానికులు పేర్కొన్నారు. ఆదిలక్ష్మి (30), మేఘన రెడ్డి (20), నరసింహారెడ్డి (53), కాటసాని భాస్కర్ రెడ్డి (45), జయలక్ష్మి (55) గాయపడగా వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. కాగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మృతులు గాయపడిన వారు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారుకావడంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Exit mobile version