Yadadri: యాదాద్రి జిల్లాలో ఓ కన్నతల్లి కర్కశత్వం ప్రదర్శించింది. సహజీవనానికి అడ్డుగా ఉన్నారని.. పిల్లల్ని వదిలేసిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఆ చిన్నారులు ఇప్పుడు రోడ్డున పడ్డారు.
కన్నతల్లి ముగ్గురు పిల్లలను వదిలేయడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. అండగా ఉంటాడనుకున్న తండ్రి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ ముగ్గురి పిల్లల భారం చూడలేక.. తల్లి ఆ ముగ్గురిని వేరే ఊరిలో వదిలి వెళ్లిపోయింది. తన సహజీవనానికి అడ్డుగా ఉన్నారని వారిని తొలగించుకుంది.
అభం శుభం తెలియని పసివాళ్లు వారు. వేలుపట్టుకుని నడిపించాల్సిన తండ్రే వారిని కాదనుకుని వెళ్లిపోయాడు.
ఇక వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే.. మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది.
తమ సంతోషానికి అడ్డుగా ఉన్నారని.. పిల్లల్ని వేరే ఊరిలో వదిలేసింది.
తల్లి అలా ఎందుకు వదిలేసిందో.. నాన్న ఎందుకు వెళ్లిపోయాడో తెలియని పసి మనసులు వారివి.
దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న ఆ పిల్లల్ని చూస్తే ఎవరికైనా కన్నీళ్లు రావల్సిందే.
రోడ్డుపై తిరుగుతున్న ఆ చిన్నారుల్ని.. ట్రాఫిక్ పోలీస్ గమనించి వారిని సంరక్షణ కేంద్రానికి తరలించారు.
ఈ నెల 15న యాదాద్రి (Yadadri) వైకుంఠ ద్వారం వద్ద.. ఆ తర్వాత బస్టాండ్ వద్ద ముగ్గురు చిన్నారులు తిరుగుతుండటంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ వారిని గమనించాడు.
వారిని దగ్గరకు తీసుకొని వివరాలు సేకరించగా.. తప్పిపోయినట్లు గుర్తించి పోలీస్ స్టేషన్ లో అప్పగించాడు.
చిన్నారుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. వారిది రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
సరూర్ నగర్ స్టేషన్ నుంచి వివరాలు సేకరించగా.. పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
తల్లిదండ్రులది ప్రేమ వివాహమని.. పిల్లలు అయ్యాక కుటుంబ కలహాలతో తండ్రి కుటుంబాన్ని వదిలేసినట్లు తేలింది.
కొద్ది రోజులుగా ఆటోడ్రైవర్‌తో ఆ మహిళ సహజీవనం సాగిస్తోందని తేలింది. వీరికి కూడా ఒక పాప ఉందని.. విచారణలో తేలింది.
రెండు రోజుల అనంతరం చిన్నారుల పెద్దనాన్న వచ్చి వారిని గుర్తించారు.
తన తమ్ముడు వీరికి దూరంగా ఉంటున్నాడని వివరించాడు. పిల్లలతో తనకు ఎలాంటి సంబంధం లేదని వారి పెదనాన్న అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
బాలల సంరక్షణ సమితి ఎదుట ప్రవేశపెట్టగా.. విస్తుపోయే విషయాలు తెలిపారు.
ఈ నెల 14న ఆటోలో యాదగిరిగుట్టకు తీసుకువచ్చారని.. కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వదిలేశారని చిన్నారులు వివరించారు.
కట్లు తామే విప్పుకొని బయటపడ్డామని బాలుడు తెలిపాడు. సహజీవనానికి అడ్డుగా ఉన్నారనే తల్లి ఇలా చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/