Site icon Prime9

Karnataka: కర్ణాటకలో ఐఫోన్ కోసం డబ్బు చెల్లించలేక డెలివరీ బాయ్‌ని చంపేసిన యువకుడు

Karnataka

Karnataka

Karnataka: ఆర్డర్ చేసిన ఐఫోన్ కోసం డబ్బు చెల్లించలేక, కర్ణాటకలోని హాసన్‌లో 20 ఏళ్ల యువకుడుఈ-కార్ట్ డెలివరీ బాయ్‌ని కత్తితో పొడిచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యువకుడు మృతదేహాన్ని మూడు రోజుల పాటు తన నివాసంలో ఉంచి మృతదేహాన్ని తగలబెట్టాడు.

డెలివరీ బాయ్‌ని కత్తితో పొడిచి చంపాడు..(Karnataka)

ఫిబ్రవరి 7న హాసన్‌లోని అరసికెరెలో నిందితుడు హేమంత్ దత్ ఆర్డర్ చేసిన ఐఫోన్ డెలివరీ జరిగినపుడు ఈ షాకింగ్ సంఘటన జరిగింది.హేమంత్ నాయక్‌పై పలుమార్లు కత్తిపోట్లు జరిగినట్లు సమాచారం. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఐఫోన్ డెలివరీ చేసేందుకు నాయక్ దత్ నివాసానికి వచ్చినప్పుడు, డెలివరీ బాయ్‌ని తన ఇంటిలో కూర్చోమని  కోరాడు. అతను తన గదిలోని డబ్బుతో త్వరలో తిరిగి వస్తానని చెప్పాడు. దత్ డబ్బుకు బదులుగా కత్తితో బయటకు వచ్చి డెలివరీ బాయ్‌ని పలుమార్లు పొడిచాడు.అనంతరం  మృత దేహాన్ని గోనెసంచిలో కట్టి 3 రోజుల పాటు ఉంచాడు.

సాక్ష్యాలు లేకుండా చేయాలని పెట్రోలుతో కాల్చేసాడు..(Karnataka)

మృతదేహాన్ని పట్టణ శివారులో ఏదో ఒక సమయంలో పడేయాలని హేమంత్ దత్ నిర్ణయించుకున్నాడు. దత్ మృతదేహాన్ని పారవేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే సాక్ష్యాలను నాశనం చేయడానికి పెట్రోల్ కొని, మృతదేహాన్ని తన ద్విచక్ర వాహనంపై సమీపంలోని రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లాడు, అక్కడ అతను దానిని కాల్చాడు.అతను పెట్రోల్ కొనుగోలు మరియు మృతదేహాన్ని తీసుకువెళుతున్న దృశ్యాలను సీసీటీవీ ఫుటేజీ ద్వారా పట్టుకున్నారు. విచారణ అనంతరం హాసన్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ఫోన్ కు డబ్బుచెల్లించలేక డెలివరీ ఉద్యోగిని చంపేసిన జిమ్ ట్రైనర్ ..(Karnataka)

కొద్దికాలం కిందట బెంగళూరులో ఇటువంటి సంఘటనే వెలుగుచూసింది.వరుణ్ అనే జిమ్ ట్రైనర్ ఆన్‌లైన్‌లో ఫోన్ ఆర్డర్ చేసి జిమ్‌ని తన అడ్రస్‌గా ఇచ్చాడు, అయితే రెడ్‌మి ఫోన్ కోసం  తన వద్ద రూ.11,999 లేకపోవడంతో డెలివరీ  ఉద్యోగిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.ఫ్లిప్‌కార్ట్ డెలివరీ మ్యాన్ నంజుండ స్వామి వరుణ్ కుమార్‌కు స్మార్ట్‌ఫోన్ డెలివరీ చేసేందుకు వచ్చాడు. అతనిపై వరుణ్ ఇనుపరాడ్డతో దాడి చేసాడు. స్పృహ తప్పి పడిపోయిన నంజుండస్వామి గొంతును కోసి అనంతరం మృతదేహాన్ని బిల్దింగ్ లోని సెల్లార్‌కు ఈడ్చుకెళ్లి పడేసాడు. రెండు రోజులుగా ఇంటికి రాకపోవడంతో నంజుండస్వామి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. బెంగళూరు పోలీసులు అతని మృతదేహాన్ని సెల్లార్ లో కనుగొని దర్యాప్తు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఫోన్ తీసుకోవడానికి డబ్బు లేకపోవడంతోనే డెలివరీ మ్యాన్ ను వరుణ్ చంపేసాడని తేలింది,

 

Exit mobile version