Hyderabad: నగరం నడిబొడ్డున దారుణం చోటు చేసుకుంది. సనత్ నగర్ లో పరిధిలో బాలుడు దారుణహత్యకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే బాలుడి మృతి పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్ నగర్ పారిశ్రామిక వాడలోని అల్లావుద్దీన్ కోటి ఏరియాలో నివాసం ఉండే అబ్దుల్ వహీద్ (8) బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ బాలుడి మృత దేహం సమీపంలోని ఓ నాలాలో గుర్తించారు. అయితే బాలుడి ఓ హిజ్రా నరబలి ఇచ్చినట్టుగా స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఎముకలు విరిచి సంచిలో కుక్కి(Hyderabad)
రెడీమేడ్ దుస్తుల వ్యాపారి వసీం ఖాన్ .. అదే ఏరియాలో ఉండే పిజాఖాన్(హిజ్రా) వద్ద చిట్టీలు వేశాడు. దీనికి సంబంధించి ఇరువురి మధ్య గురువారం గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం అబ్డుల్ వహీద్ (8) నమాజ్ చేయడానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికిన కుటుంబసభ్యులు.. లాభం లేకపోవడంతో పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా బాలుడిని నలుగురు వ్యక్తులు బస్తీలోని ఓ వీధిలో అపహరించినట్టు గుర్తించారు. ప్లాస్టిక్ సంచిలో తీసుకుని ఫిజాఖాన్ ఇంటి వైపుకు వెళ్లారు. దీంతో నిందితులను పోలీసులు పట్టుకుని విచారించారు.
హిజ్రా ఇంటిపై దాడి(Hyderabad)
బాలుడి మృతదేహాన్ని జింకలవాడ సమీపంలోని ఓ నాలాలో వేసినట్లు వారు అంగీకరించడంతో అర్ధరాత్రి స్థానికుల సాయంతో నాలాలో వెతికారు. ఓ ప్లాస్టిక్ సంచిలో మృతదేహం గుర్తించి వెలికి తీశారు. బాలుడిని హత్య చేసిన నిందితులు.. ఎముకలను ఎక్కడిక్కడ విరిచేసి ఓ బకెట్‌లో కుక్కారు. బకెట్‌ను ప్లాస్టిక్ సంచిలో తీసుకుని వెళ్లి నాలాలో విసిరేసినట్లు తేలింది. అయితే బాలుడిని హిజ్రా నరబలి ఇచ్చినట్లుగా బస్తీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హిజ్రా ఇంటిపై స్థానికులు దాడి చేశారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ ఘటనతో అల్లాదున్ కోటి బస్తీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.చిట్టీ డబ్బుల గొడవ కారణంగానే హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.