Site icon Prime9

Hyderabad Accident: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం.. గోడ కూలి ముగ్గురు దుర్మరణం

Hyderabad Wall Collaed Three Members Died: హైదరాబాద్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎల్బీనగర్‌లో ఓ గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో దశరథ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను కామినేని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులంతా ఖమ్మం జిల్లా వాసులుగా గుర్తించారు.

కాగా, ఎల్బీ నగర్‌లో గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే సెల్లార్ కోసం గుంతలు తీస్తుండగా.. పక్కన అదే స్థలంలో ఉన్న గోడ కూలిపోయింది. ఈ గోడ శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నారు. ఇందులో ముగ్గురు చనిపోయారు. మృతులు వీరయ్య, రాము, వాసుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో దశరథకు కాలు విరిగిందని తెలుస్తోంది. వీరంతా ఖమ్మం జిల్లా సీతారామాపురం తండాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు.

Exit mobile version
Skip to toolbar