Site icon Prime9

Wife Swapping Game: భార్య మార్పిడి క్రీడ.. కీచకుడిగా మారిన భర్త..!

wife swapping game in Rajasthan

wife swapping game in Rajasthan

Wife Swapping Game: మన సంప్రదాయాలను మరచి పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడుతూ దేశ సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నారు కొందరు వ్యక్తులు. ఈ కోవకు చెందినదే ఈ వార్త కూడా. తన భార్య తనకే సొంతమని భావించని.. ఓ భర్త కట్టుకున్న భార్యను మరో పర పురుషుడికి పడక సుఖం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అనగా భార్య మార్పిడి క్రీడ (వైఫ్ స్వాపింగ్ గేమ్) ఆడాలని అతడు తన భార్యని ఒత్తిడి చేశాడు. దానికి ఆమె అంగీకరించలేదని ఆ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హోటల్ గదిలో బంధించి ఆమెపై దాడి చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్‌లో ప్రాంతంలో వెలుగు చూసింది.

భార్యల మార్పిడికి సంబంధించిన షాకింగ్ కేసు రాజస్థాన్‌లోని బికనీర్‌లో వెలుగు చూసింది. ఒకరి భార్యను మరొకరికి ఇచ్చిపుచ్చుకునే ఈ దారుణమైన పాశ్చాత్య క్రీడలో పాల్గొనడానికి తాను నిరాకరించానని తన భర్త తనపై క్రూరంగా దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజస్థాన్‌ బికనీర్‌లోని 5-స్టార్ హోటల్‌లో బాధితురాలి భర్త అమ్మర్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. కాగా ఓ రోజు అమ్మర్ (భర్త) తనను హోటల్‌ గదిలోకి లాక్కెళ్లి తనను కిరాతకంగా కొట్టాడని తన దగ్గర ఉన్న ఫోన్‌ తీసుకుని తనని గదిలో బంధించి వెళ్లిపోయాడని బాధితురాలు తెలిపింది. రెండు రోజుల తర్వాత మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకుంటూ అక్కడి వచ్చాడని, తన భర్త ద్విలింగ సంపర్కుడని ఆమె ఫిర్యాదులో పేర్కొనింది. తాను తన భర్త ప్రవర్తనతో చాలా రోజులుగా బాధపడుతున్నానని, కానీ భార్య మార్పిడి ఆటకు మాత్రం తాను ఒప్పుకోలేదని ఫిర్యాదుదారు తెలిపింది.

తన భర్త ఘాతుకాల గురించి అత్తమామలకు చెప్పినా వారు వినిపించుకునే వారు కాదని, పైగా అది లేటెస్ట్ ట్రెండ్ అంటూ అతన్ని వెనకేసుకొచ్చేవారని బాధితురాలు వాపోయింది. కాగా కొద్దిరోజుల తర్వాత బంధువులు వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకొని వెళ్లారని దానితో అక్కడికి వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడైన భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసినట్లు భోపాల్‌ పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: హిందీలో ఎంబీబీఎస్.. ఇదో విప్లవాత్మకమైన ఘట్టమన్న అమిత్ షా

Exit mobile version