Site icon Prime9

Theft in Big C: బిగ్ సి సెల్‌షాప్‌లో భారీ ఛోరీ.

Huge theft in Big C Cellshop

Huge theft in Big C Cellshop

NTR District: ఎన్టీఆర్ జిల్లాలో దొంగలు పడ్డారు. ఓ సెల్ ఫోన్ దుకాణంలో భారీ ఛోరీకి పాల్పొడ్డారు. సమాచారం మేరకు తిరువూరు పట్టణం మెయిన్ రోడ్డులోని బిగ్ సి షాపును యధావిధిగా రాత్రికి తాళాలు వేశారు. గుడ్డ పలుగులతో షట్టర్ తాళాలు పగలగొట్టిన గుర్తు తెలియని దొంగలు దుకాణాన్ని లూటీ చేశారు.

విలువైన సెల్ ఫోన్లను, నగదును అపహరించారు. విషయం తెలుసుకొన్న పోలీసులు విచారణ ప్రారంభించారు. పట్టణ నడిబొడ్డున దొంగతనం జరగడంతో పలువురు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు నిఘా ఉన్నప్పటికీ దొంగతనం జరడం పట్ల పహారాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదే తరహాలో కొద్ది రోజుల కిందట హైదరాబాదు ఈసిఐఎల్ లోని ఓ సెల్ ఫోన్ దుకాణంలో భారీ యెత్తున దోపిడీ చేశారు. ఆ కేసులో బంగ్లాదేశ్ సమీపంలోని వ్యక్తులు పనిగా పోలీసులు నిర్దారించివున్నారు. అయితే కేసు రికవరీలో ఎలాంటి పురోగతి లేదు. ఇదే తరహాలో తిరువూరు లో కూడా సెల్ ఫోన్ దుకాణంలో ఛోరీ జరగడం పట్ల తెలంగాణ పోలీసులను సంప్రదిస్తే దోపిడీకి పాల్పొడ్డ వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Youth died: జలపాతంలో నీటమునిగి ఆంధ్ర యువకుడు మృతి…

Exit mobile version