Site icon Prime9

Telangana: పరువు హత్య.. ప్రేమించిందని కన్న కూతురినే కడతేర్చిన తండ్రి

four-of-family-hacked-to-death-in-delhis-palam

four-of-family-hacked-to-death-in-delhis-palam

Telangana: ప్రేమలు, ప్రేమ పెళ్లిళ్లు నేటి సమాజంలో కామన్ గా మారిపోయాయి. అయితే వాటికి కొందరు పరువు పోతుందంటూ, నలుగురులో ఏ ముఖం పెట్టుకుని తిరగాలంటూ, కులం కాదు, మతం కాదు అంటూ కొందరు పెద్దలు ప్రేమను వ్యతిరేకిస్తుంటారు. అయితే పెద్దలను వ్యతిరేకించిన పిల్లలను కొందరు కర్కశులు అతి కిరాతకంగా పొట్టనపెట్టుకుంటున్నారు. ఇదే తరహా ఘటన ఒకటి తెలంగాణలో చోటుచేసుంకుంది. ప్రేమ పేరుతో కుటుంబ పరువు తీస్తుందంటూ కన్నకూతురిని విచక్షణా రహితంగా నరికి చంపాడు ఓ కసాయి తండ్రి.

తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఓ హత్య కలకలం రేపింది. పెబ్బేరు మండలం పాతపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్, సునీత దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా వారిలో గీత అనే 15ఏళ్ల అమ్మాయి పదో తరగతి చదువుతుంది. అయితే ఈ అమ్మాయి గత కొన్ని రోజులుగా గ్రామానికి చెందిన ఓ అబ్బాయితో ప్రేమలో ఉందని తెలుసుకున్న తండ్రి ఆ విషయంపై కన్నెర్ర చేశాడు. ఇదే విషయంలో తన కూతురిని నిలదీశాడు. ప్రేమ పేరుతో కుటుంబం పరువు తీయకంటూ హెచ్చరించాడు. కానీ తండ్రి మాటలను పట్టించుకోని గీత తన ప్రేమను కొనసాగిస్తూ వచ్చింది. దీనిని గమనించిన తండ్రి ఈ నేపథ్యంలోనే మంగళవారం బాలిక తల్లి ఇంట్లో ఎవరూ లేని సమయంచూసి మరోసారి కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు తండ్రి. కాగా ఆ క్షణంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దానితో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి రాజశేఖర్ విచక్షణ కోల్పోయిన కాళ్లు, చేతులు కట్టేసి కన్న కూతురిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. దానితో తీవ్రంగా గాయపడిన యువతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ఇదిలా ఉండగా ఆ అమ్మాయిని ప్రేమించిన యువకుడు కూడా అదే సామజిక వర్గానికి చెందివాడని, అమ్మాయి కుంటుంబంతో సన్నిహిత సంబంధం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా సొంత కూతురిని తండ్రి హత్య చేయడంతో గ్రామంలో ఒక్కసారిగా భయాందోళన వాతావరణం ఏర్పడింది. ఇకపోతే కూతురిని హత్య చేసిన తరువాత రాజశేఖర్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్టు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు హత్య జరిగిన స్థలాన్ని పరిశీలించి, క్లూస్‌టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి: కాంతార మూవీ చూస్తూ వ్యక్తి మృతి.. ఎక్కడంటే..?

Exit mobile version