Site icon Prime9

Ongole Crime: వివాహితను బైక్​తో ఢీ కొట్టి.. ఆపై అత్యాచారం..!

wife swapping game in Rajasthan

wife swapping game in Rajasthan

Ongole Crime: రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరుగిపోతున్నాయి. తాజాగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వివాహితను ఢీకొట్టి మరీ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కామాంధులు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు శివారులో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. బాధిత మహిళ ప్రతి రోజూ ద్విచక్ర వాహనంపై ఒంగోలు వచ్చి కూరగాయలు అమ్మి వెళ్తుంటుంది. రోజులానే మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలోనూ ఒంగోలు నుంచి తిరిగి వెళ్తుండగా మద్యం సేవించి ఉన్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఆమెను వెంబడించారు. నిర్మానుష్య ప్రాంతానికి చేరుకోగానే ఆమె వాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టారు. దానితో ద్విచక్రవాహనం నుంచి కిందపడిన ఆమెను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి అక్కడి నుంచి పరారయ్యారు. అర్ధరాత్రి అవుతున్నా మహిళ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లారు. ఈ క్రమంలోనే ఆమె మార్గమధ్యలో తారసపడింది. జరిగిన విషయం వారికి వివరించింది. దానితో నిందితుల కోసం వారు గాలించగా కొత్తపట్నం రోడ్డులోని ఓ పెట్రోలు బంకు వద్ద వారు కనిపించారు. వారిని పట్టుకునే లోపే అక్కడి నుంచి జారుకున్నారు.

కాగా ఈ ఘటనపై తర్వాత రోజు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితురాలిని వెంటనే వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే కొప్పోలు సమీపంలోని చేపల చెరువుల వద్ద కాపలాదారులుగా పనిచేస్తున్న ఇద్దరు యువకులే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: తండ్రీకొడుకుల దారుణ హత్య

Exit mobile version