Gang Rape In Konaseema : కామంతో కళ్ళు మూసుకుపోతున్న మృగాళ్లు ఆడవారిపై హింసాకాండను కొనసాగిస్తూనే ఉంటున్నారు. చిన్నా, పెద్ద తారతమ్యాలను మరచిపోతూ.. వావివరసాలను సైతం గాలి కొదిలేస్తూ పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటనలకు ముగింపు ఎప్పుదు వస్తుందా అని భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు ఆడవారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఐదుగురు సామూహిక అత్యాచారం జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగింది అంటే..
జిల్లాలోని కాట్రేనికోన మండలంలోని సముద్ర తీర గ్రామమైన చిర్ర యానాంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఐదుగురు నిందితును అరెస్ట్ చేసి వారిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాధిత బాలిక ఈ నెల 6న బట్టలు ఉతికేందుకు వెళ్లగా అక్కడే ఉన్న ఐదుగురు మేజర్ యువకులు ఆమెపై కన్నేశారు. సదరు బాలికతో మాట కలిపారు. మాయ మాటలు చెప్పి పక్కనే ఉన్న గుబురు పొదల్లోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఐదుగురూ కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారంతా పారిపోయారు. ఫిబ్రవరి 6న జరిగిన ఘటన ఫిబ్రవరి 16వరకు వెలుగులోకి రాలేదు.
కప్పిపుచ్చేందుకు చూసిన అధికార పార్టీ నేతలు (Gang Rape In Konaseema)..
అయితే బాలిక అలా ఉండడంతో ఏమైందని ప్రశ్నించిన తల్లిదండ్రులకు అసలు విషయాన్ని తెలిపింది. అయితే అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు యువకులు అధికార పార్టీకి చెందిన నాయకుల కుమారులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దారుణానికి ఒడిగట్టిన నిందితులు బాధిత కుటుంబాన్ని బెదిరించడం మొదలు పెట్టారు. కానీ, బాలిక తండ్రి ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని నిరాకరించడంతో ఎట్టకేలకు పది రోజుల తర్వాత పోలీసులు పొక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఐదుగురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు సర్పంచ్ కుమారుడు ఓలేటి తేజ, ఓలేటి తులసిరావు (తులసి), మల్లాడి వంశీ, ఓలేటి ధర్మరాజు, అర్థాని సత్తిపండులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు కాట్రేని కోన ఎస్ఐ పి.శ్రీనివాస్ తెలిపారు.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/