Telangana: రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పౌరసరఫరాల శాఖ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపుగా 13లక్షల గోనె సంచులు కాలి బూడిద అయ్యాయి. ప్రమాదవ శాత్తు జరిగిన ఈ ఘటనలో గోదాములో భారీ యెత్తున మంటలు ఎగిసిబడ్డాయి. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అధికారులు గోదాము వద్దకు పరుగులు తీశారు. క్షేత్ర స్థాయిలో పరిస్ధితిని పరిశీలించారు.
గోదాము సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మంటలు చెలరేగిన్నట్లు స్థానికుల పేర్కొంటున్నారు. దీపావళి కావడంతో తగు జాగ్రత్తలు తీసుకోక పోయి ఉండచ్చని భావిస్తున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అగ్నికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Governor vs CM: గవర్నర్ ను పిలిచేదెప్పుడు…బిల్లులు పాస్ చేసుకొనేది ఎప్పుడు…అహంకార పూరితంగా వ్యవహరిస్తున్న కేసిఆర్