Site icon Prime9

Ram Gopal Varma: ఏపీ పోలీసుల ఎదుట రాంగోపాల్ వర్మ.. ఫొటోల మార్పింగ్‌ కేసుపై విచారణ

Film Director Ram Gopal Varma To Attend Police Enquiry In Ongole: వివాదాస్పద ఫిల్మ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్, అనుచిత వ్యాఖ్యలు తదితర కేసులో ఆయన ఏపీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అయితే టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయకుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ మంత్రి నారా లోకేశ్‌ల ఫొటోలను గతంలో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆయనపై కేసు నమోదైంది.

అయితే, ఫొటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు రాంగోపాల్ వర్మకు గతంలో నోటీసులు ఇవ్వగా.. రాంగోపాల్ వర్మ గైర్హాజరయ్యారు. ఈ మేరకు ఆయన ఇలా చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్‌లో భాగంగా బిజీగా ఉన్నందను తర్వాత రోజు వస్తానని వాట్సప్ ద్వారా సమాచారం అందించారు. కానీ పోలీసులు అనుమతి లేకుండానే ఆయన హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులు రావడంతో అప్పటినుంచి కనిపించకుండా పోయారు.

ఆ తర్వాత తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని, కేసు కొట్టివేయాలంటూ రాంగోపాల్ వర్మ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు అన్యాయంగా కేసు నమోదు చేశారని, ఆ ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోర్టు కోరారు. ఈ విషయంలో హైకోర్టు.. వర్మకు బెయిల్ మంజూరు చేసింది. కానీ పోలీసుల విచారణకు హాజరై సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణకు హాజరుకావాలని పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఒంగోలు రూరల్ పీఎస్‌లో శుక్రవారం విచారణఖు హాజరయ్యారు.

Exit mobile version
Skip to toolbar