Vijayawada: కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు కన్నా కూతురు పైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
తండ్రిగా కూతుర్ని కంటికి రెప్పాలాగా కాపాడాల్సినది పోయి.. సభ్యసమాజం సైతం తలదించుకునేలా దారుణానికి పాల్పడ్డాడు.
కన్న కుమార్తెపై మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్న దారుణ ఘటన తాజాగా చోటుచేసుకుంది. ఈ ఘటన విజయవాడ(Vijayawada) లో శుక్రవారం నాడు వెలుగులోకి వచ్చింది.
మాచవరానికి చెందిన ఓ వ్యక్తి కారు డ్రైవరుగా పనిచేస్తూ.. ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు.
ఇతడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు 13 సంవత్సరాలు. ఒకసారి భర్త ఫోన్లో.. భర్త,పెద్ద కుమార్తెల నగ్నచిత్రాలు చూసిన భార్య వాటి గురించి ప్రశ్నించింది.
అవి నిజమైనవి కావంటూ అతడు వాటిని తొలగించడంతో ఊరుకుంది. కానీ భర్త ప్రవర్తన సరిగా లేకపోవటంతో.. ఇద్దరు కుమార్తెలను 2022 జులై నుంచి గన్నవరంలోని ఓ వసతిగృహంలో ఉంచి చదివిస్తుంది. కాగా ఈ నెల 7వ తేదీన కుమార్తెలిద్దరూ ఇంటికి వచ్చారు.
పెద్ద కుమార్తె తనకు దూరంగా ఉండటంతో.. ఆ బాలికను బెల్టుతో చావగోట్టాడు ఆ దుర్మార్గుడు.
అడ్డుకున్న భార్యను దుర్భాషలాడి ఆమెను కూడా కొట్టబోయాడు.
తర్వాత పిల్లలిద్దరూ వసతిగృహానికి వెళ్లిపోయి తిరిగి 10వ తేదీన వచ్చారు.
ఆ రోజు సాయంత్రం తండ్రి.. పెద్ద కుమార్తెను బ్యాంకు పని ఉందని ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని తీసుకెళ్లి.. తర్వాత తీసుకొచ్చాడు.
ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో.. పెద్ద కుమార్తె తల్లి వద్దకు వచ్చి తండ్రి తనపై చేసిన అఘాయిత్యాన్ని చెప్పింది.
బ్యాంకుకని చెప్పి రామవరప్పాడు పైవంతెన సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లి, అక్కడ అత్యాచారం చేసినట్లు వివరించింది.
తండ్రి కాదు కిరాతకుడు..
తండ్రి చర్యలను అడ్డుకోగా.. తనను ముళ్ళకర్రతో కొట్టినట్లు వివరించింది.
తనపై మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్నట్లు కుమార్తె చెప్పటంతో తల్లికి నోట మాట రాక బోరున విలపించింది.
దీంతో వారికి న్యాయం చేయాలని దిశ పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు పోక్సో చట్టం కింద బాలిక తండ్రిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సమాజం సైతం సిగ్గు పడేలా దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.
ప్రస్తుత కాలంలో అమ్మాయిలకు బయటే రక్షణ లేదని భయపడుతుంటుంటే.. ఇంట్లోని కుటుంబ సభ్యులా దగ్గర కూడా రక్షణ లేకపోవడం మరింత విచారాన్ని కలిగిస్తుంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/