Site icon Prime9

Crime News: విషాద ఘటన.. కుటుంబ కలహాలతో తండ్రీకొడుకు మృతి

father committed suicide along with his son in ntr dist

father committed suicide along with his son in ntr dist

Crime News: చిన్నచిన్న గొడవలే ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. పచ్చని కాపురంలో చెలరేగిన మంటలు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణ కాస్త తండ్రి, కుమారుల మరణానికి దారి తీసింది. అప్పటికే కూతురిని పోగొట్టుకున్న ఆ తండ్రి తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. దానికి తోడు నిత్యం ఇంట్లో జరిగే గొడవలు అతనిపై మరింత ప్రభావాన్ని చూపాయి. దానితో ఓ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కుమారుడితో కలిసి రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఆంధ్రప్రదేశ్ ఎన్‌టీఆర్‌ జిల్లా మైలవరం చిన రామాలయంలో విషాదం చోటుచేసుకుంది. బీఎడ్ పూర్తి చేసి రేషన్ డీలర్ గా రామారావు అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి తొమ్మిదేళ్ల కిందట దుర్గ అనే మహిళతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు మరియు ఒక కుమార్తె ఉన్నారు. కాగా ఇటీవల ఏడాది క్రితం కూతురు మహాలక్ష్మి అనారోగ్యంతో మృత్యువాత పడింది. దానితో రామారావు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు సంభవించాయి. అవికాస్త మరింత తీవ్రతరం అయ్యాయి వాటిని భరించలేక మానసికంగా రామారావు బాగా కుంగిపోయాడు.

దానితో అతను ఎవరూ లేని సమయం చూసి కుమారుడిని తీసుకుని రేమిడిచర్ల రైల్వే గేట్‌ వద్దకు వెళ్లాడు. అటుగా ట్రాక్ పై వస్తోన్న గూడ్స్‌ రైలుకు ఎదురుగా కుమారుడితో కలిసి నిలబడడంతో రైలు ఇద్దరినీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో తండ్రీ కొడుకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా రామారావు తండ్రి మరణించగా తల్లి ఒంటరిగా జీవిస్తున్నారు ఇప్పుడు కుమారుడు మరణించడంతో ఆమె గుండెలవిసేలా రోధిస్తున్నారు.

ఇదీ చదవండి: ఉగాండాలో అగ్ని ప్రమాదం..11 మంది అంధ విద్యార్ధులు మృత్యవాత

Exit mobile version