Site icon Prime9

Crime News : విశాఖలో దారుణం.. మూడేళ్లుగా కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడి

Crime News about sexual abuse of father on daughter at vizag

Crime News about sexual abuse of father on daughter at vizag

Crime News : దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. రాను రాను సమాజం ఇలా తయారు అవుతుంది ఏంటి.. మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కన్న కూతురిపై మూడేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న అమానుష ఘటన విశాఖపట్నంలోని జీవీఎంసీ పరిధిలో వెలుగు చూసింది. ఇక్కడ మరో దారుణ విషయం ఏంటంటే.. ఈ విషయం తల్లికి తెలిసినా ఎదిరించకపోవడం. దీంతో ఆ కీచక తండ్రి మూడేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు. ఇక ఏ మాత్రం సహించలేకపోయిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జీవీఎంసీ 61 వార్డు మల్కాపురం సమీపంలో ఉన్న ఇండస్ట్రియల్ కాలనీలో హనుమంత శివ అనే వ్యక్తి కొంతకాలంగా భార్య, కొడుకు, కూతురితో కలిసి కాపురం ఉంటున్నాడు. కూతురు డిగ్రీ చదువుకుంటుంది. గురువారం నాడు ఆ తండ్రి ఆమెను గాజువాకలోని ఓ కోచింగ్ సెంటర్లో పరీక్షకు తీసుకెళ్తున్నానని ఇంట్లో చెప్పి బైక్ పై తీసుకు వెళ్ళాడు. కానీ నేరుగా ఓ లాడ్జికి తీసుకువెళ్లాడు. అక్కడ ఓ రూమ్ బుక్ చేసి ఆమె మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు.

ఆ తరువాత ఇంటికి తీసుకువచ్చాడు. తల్లిని చూడగానే కన్నీరు మున్నీరవుతూ ఆ యువతి తండ్రి చేసిన ఘాతుకాన్ని చెప్పింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారు కూడా విన్నారు. వెంటనే వారు కూడా స్పందించడంతో దీంతో గత మూడేళ్లుగా తన మీద చేస్తున్న అరాచకాన్ని ఆ యువతి బయటపెట్టింది. తండ్రి చేసే దారుణానికి ఎదురు తిరిగినా, ప్రశ్నించినా.. తనను, తల్లిని తీవ్రంగా కొడుతున్నాడని చెప్పి రోధించింది.

ఏమైనా మాట్లాడితే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తానని.. దిక్కులేని వారు అవుతారని బెదిరించాడని తెలిపింది. దీంతో ఇది విన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు (Crime News)  చేశారు. పోలీస్ స్టేషన్లో తన తండ్రి గత మూడేళ్లుగా తనమీద చేస్తున్న అఘాయిత్యాలను చెప్పుకొని యువతి ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సీఐ జీడి బాబు విచారణ ప్రారంభించారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధిత యువతిని కేజీహెచ్ కు తరలించారు. నిందితుడు శివను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటన పట్ల స్థానికులతో పాటు ప్రజా సంఘాల నేతలు, మహిళా సంఘాల నేతలు మండిపడుతున్నారు.

Exit mobile version