Site icon Prime9

Crime News : నిద్రిస్తున్న భార్య, కూతుర్ని ప్లాన్ చేసి హతమార్చిన కిరాతకుడు..

crime-news-about-man killing-wife-and-daughter-by-snake

crime-news-about-man killing-wife-and-daughter-by-snake

Crime News : నేటి కాలంలో మానవ సంబంధాలు మంట గలిసి పోతున్నాయి అనడానికి ఇప్పుడు చెప్పుకోబోయే ఘటన కూడా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మూడు ముళ్ళ బంధంతో ఒక్కటై జీవితాంతం తోడుగా ఉంటానని హామీ ఇచ్చిన భార్యని, కన్న కూతుర్ని కడతేర్చాడు ఓ కసాయి తండ్రి. భార్య, కుమార్తెను పక్కా ప్లాన్ తో హతమార్చి చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. ఈ ఘటనలో పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఒడిశాలోని గంజాం జిల్లాలోని అధీగావ్‌కు చెందిన కె.గణేశ్ పాత్రా (25)-బసంతి పాత్రా (23) భార్యాభర్తలు. 2020లో వివాహమైన వీరికి రెండున్నరేళ్ల కుమార్తె దేబాస్మిత ఉంది. ఇటీవల భార్యతో గొడవల కారణంగా ఆమెను హత్య చేయాలని భావించిన గణేశ్ తెలివిగా ఒక పధకం పన్నాడు. పాములు పట్టే వ్యక్తి నుంచి విషపూరిత పామును సంపాదించి ఓ ప్లాస్టిక్ జార్‌లో అక్టోబరు 6న ఇంటికి తీసుకొచ్చాడు. భార్య, కుమార్తె నిద్రిస్తున్న గదిలో పామును వదిలిపెట్టి నిందితుడు మాత్రం మరో గదిలో నిద్రపోయాడు. తర్వాతి రోజు ఉదయం చూసేసరికి భార్య, కుమార్తె ఇద్దరూ మరణించి కనిపించారు.

పాము కాటుతోనే వారిద్దరూ మరణించినట్టు పోస్టుమార్టం నివేదిక కూడా వెల్లడించినప్పటికీ దీనివెనక ఏదో కుట్ర జరిగిందని బాధితురాలి కుటుంబ సభ్యులు భావించారు. అల్లుడి తీరుపై అనుమానం వ్యక్తం చేసిన బసంతి పాత్రా తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయం బయటపడింది. తొలుత ఆరోపణలను ఖండించినా పోలీసులు గట్టిగా ప్రశ్నించేసరికి అసలు విషయం బయటపెట్టాడు ఆ దుర్మార్గుడు. వారి గదిలోకి తానే పామును వదిలినట్టు అంగీకరించడంతో నిన్న అతడిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. ప్రస్తుతం ఈ విషయం స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.

Exit mobile version