Site icon Prime9

Hyderabad: జరభద్రం.. గీజర్ పేలి నవదంపతులు మృతి

father committed suicide along with his son in ntr dist

father committed suicide along with his son in ntr dist

 Hyderabad: హైదరాబాద్ నగరంలోని లంగర్‌హౌస్‌లో విషాదం చోటుచేసుకున్నది. బాత్‌రూంలో గీజర్‌ పేలి నవదంపతులు మరణించారు.

భాగ్యనగరంలోని లంగర్‌హౌస్‌ ఖాదర్‌భాగ్‌కు చెందిన డాక్టర్‌ ఉమ్మాయ్‌ మెహిమాన్‌ సాహిమ, డాక్టర్‌ నిసారుద్దీన్‌ భార్యాభర్తలు. వీరిరువురికి ఇటీవల కాలంలోనే అనగా రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. కాగా నిసారుద్దీన్‌ సూర్యాపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నాడు. అయితే, షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా బాత్‌రూమ్‌లో ఉన్న గీజర్‌ ఒక్కసారిగా పేలడంతో ఇద్దరు నవ దంపతులు మృతిచెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే సాధారణంగా వేడినీళ్లకోసం గీజర్ను ఆనే చేసి కొన్ని సార్లు మర్చిపోతుంటాము. ఆ సందర్భాల్లో కొన్ని గీజర్లు షాట్ సర్క్యూట్ కు గురయ్యి పేలే ప్రమాదం ఉందని కొందరు అంటున్నారు.

ఇదీ చదవండి: ఎంత దారుణం.. ప్లాస్మాకు బదులుగా బత్తాయిరసం ఎక్కించారు

Exit mobile version