Site icon Prime9

Viveka Murder Case: నాకు ప్రాణహాని జరిగితే సీఎం జగన్ దే బాధ్యత.. దస్తగిరి

CM Jagan is responsible if my life is threatened

CM Jagan is responsible if my life is threatened

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ బాబాయి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి తాజాగా మరోమారు ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని, తనకేమైనా జరిగితే దానికి సీఎం జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తనకు కేటాయించిన గన్ మెన్లను అకస్మాత్తుగా మార్చారని డ్రైవర్ దస్తగిరి తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని కడప ఎస్పీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

సీబీఐ ఏఎస్పీ రామ్ సింగ్ ఆదేశాలతోనే మరోసారి వచ్చి ఫిర్యాదు చేశానని దస్తగిరి పేర్కొన్నారు. తొండూరు మండలంలో కొందరు వైసీపీ నాయకులు నన్ను లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టి‌స్తున్నారని దస్తగిరి మీడియాతో చెప్పారు. కేసులో సాక్షులను ప్రభావితం చేయడం, బెదిరించడం జరుగుతోందని, హైదరాబాదు కోర్టుకు తరలించాలని వివేకా కుమార్తె సునీత పిటిషన్ పై ఈ నెలలో సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. మరీ ముఖ్యంగా సీబీఐ అధికారుల పై ఏపీ పోలీసులు కేసులు పెట్టడాన్ని ఆమె సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి ఉన్నారు. ఈ నేపధ్యంలో మరోమారు ఏపీ పోలీసుల తీరు పై వివేకా కేసులో అప్రూవర్ మారిన దస్తగిరి ఆరోపణలు చేశారు.

ఓ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి, సొంత బాబాయి కేసులో ఇలా ప్రవర్తించడం, ప్రజల్లో పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రతిపక్షాల పై కాలుదువ్వుతూ నిత్యం అసభ్యకరంగా మాట్లాడే ఏపీ మంత్రి వర్గం మాత్రం వివేకా హత్య పై ఎక్కడా నోరు మెదపటం లేదు.

ఇది కూడా చదవండి: వైకాపా అసమ్మతి నేత దారుణ హత్య.. వేటకొడవళ్లతో వెంటాడి మరీ..!

Exit mobile version