Site icon Prime9

తెలంగాణ: సంగారెడ్డి జిల్లాలోని హెటిరో పరిశ్రమలో ప్రవేశించిన చిరుత… చివరకు పట్టుకోగలిగారా?

cheetah-entered-hetero-labs

cheetah-entered-hetero-labs

Telangana: చిరుతలు, పులులు అటవీ ప్రాంతాల నుంచి ప్రజావాసాల్లోకి వచ్చి జనాల్ని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా హెటిరో పరిశ్రమలో ప్రవేశించిన చిరుతను ఎట్టకేలకు పట్టుకోగలిగారు. పోలీసులు, ఫారెస్ట్ అధికారులు శ్రమించి ఎవరికి ఏ హాని జరగక ముందే బంధించారు. జిన్నారం మండలం ఖాజీపల్లి, గడ్డపోతారం పారిశ్రామిక వాడలో సంచరిస్తున్న చిరుత… ఖాజిపల్లి హెటిరో ల్యాబ్ లోని హెచ్ బ్లాక్ లో చిరుత చొరబడింది. దానితో చిరుత సంచారంపై సంస్థ ఉద్యోగులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు పలు ప్రయత్నాలు చేసి చివరికి విజయం సాధించారు.

హెచ్ బ్లాక్ లో పైన నక్కిన చిరుతను కిందికి దింపేందుకు ఉదయం నుంచి ప్రయత్నాలు చేసి ఇప్పటికి పట్టుకోగలిగారు. అయితే ఈ ఘటనను పరిశీలిస్తే అడవి మృగాలు కూడా కాస్త ట్రెండ్ మార్చినట్టు అనిపిస్తుంది. ఈ సారి నివాస ప్రాంతాల్లోకి కాకుండా హెటిరో పరిశ్రమలో చిరుత ప్రవేశించింది. దానితో చిరుతను పరిశ్రమ సిబ్బంది హడలిపోయారు. అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో చిరుత కంపెనీలోకి ప్రవేశించినట్లు సమాచారం అందుతుంది. కాగా చిరుతను బంధించేందుకు అధికారులు నానా ప్రయత్నాలు చేశారు.

చిరుతను బంధించేందుకు పరిశ్రమలో బోను కూడా ఏర్పాటు చేశారు. అలానే ఉద్యోగులెవరినీ బయటకు రావద్దని ఫారెస్ట్ అధికారులు సూచించారు. కాగా మూడు నెలల క్రితం కూడా ఇలా చిరుతలు పరిశ్రమలోకి ప్రవేశించినట్టు సీసీటీవీలో రికార్డు అయ్యిందని అక్కడి సిబ్బంది అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో తెలంగాణలో రాష్ట్రంలో జంతువుల బెదడ ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్ మరియు కుమురం భీం జిల్లాల్లోని ప్రజలను పెద్దపులుల భయం వెంటాడుతోంది. రాష్ట్రానికి మహారాష్ట్ర సరిహద్దు కావడం… పక్కనే అరణ్యం ఉండడం వల్ల అడవి లోని వ్యన్యప్రాణులు ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. దీనిపై అధికారులకు ఎన్ని సార్లు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోతుందని… ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అక్కడి స్థానికులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: తెలంగాణ కాంగ్రెస్ లో ముదిరిన వివాదం… ఒరిజినల్ మేమే అంటూ… ఆ నేతని టార్గెట్?

Exit mobile version